Corona Cases: ఇండియాలో 640 కరోనా కేసులు నమోదు, ఒకరు మృతి!

  • Written By:
  • Publish Date - December 22, 2023 / 01:58 PM IST

Corona Cases: దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 640 కరోనా కేసులు నమోదవ‌గా.. ఒకరు మృతి చెందారు. దేశంలో మొత్తంగా నేటి వరకూ 2వేల 9వంద‌ల 97 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజు కేరళలో 265 కొత్త కోవిడ్ 19 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందారు. కేరళలో ప్రస్తుతం 2వేల 606 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. కేరళ తరువాత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, మహారాష్ట్రల్లో ఎక్కువగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో కొత్తగా 5, ఏపీలో 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం తెలంగాణలో 19 యాక్టివ్ కేసులు, ఏపీలో 4 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇక తమిళనాడులో 15, కర్ణాటకలో13 కొత్త కేసులు నమోదయ్యాయి. జెఎన్.1 కొత్త వేరియంట్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.

తెలంగాణ రాష్ట్రంలో క్రమంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో 925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 6 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ♦దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 19కి చేరింది. కరోనా బారి నుంచి ఒకరు కోలుకున్నట్లు తెలంగాణ‌ వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. కరోనా లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరారు. మ‌రోవైపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ర‌ద్దీ ప్రాంతాల్లోనూ మాస్కుల‌ను త‌ప్ప‌ని చేశారు. బ్యాంకులు, విద్యాల‌యాలు, ఆర్టీసీ బ‌స్సులు, వైద్య‌శాలల్లో మాస్కులు త‌ప్ప‌నిస‌రిగా ధ‌రించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం సూచించింది.