6 States Alert : చైనా ఇన్ఫెక్షన్ల ఎఫెక్ట్.. ఇండియాలోని 6 రాష్ట్రాల్లో అలర్ట్

6 States Alert : చైనాలోని పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 01:14 PM IST

6 States Alert : చైనాలోని పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ అలర్ట్ అయింది. ఆరు రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. కొత్తగా నమోదవుతున్న శ్వాసకోశ సమస్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, హర్యానా, తమిళనాడు రాష్ట్రాలకు సూచించింది.  శ్వాసకోశ సమస్యలతో వచ్చే రోగులకు చికిత్స చేేసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నిర్దేశించింది.

  • సీజనల్ ఫ్లూ ముప్పు పొంచి ఉందని, ప్రజలు అలర్ట్‌గా ఉండాలని కర్ణాటక ప్రభుత్వం సూచించింది. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోరు, ముక్కు భాగాలను కప్పి ఉంచుకోవాలని ప్రజలకు సూచించింది. తరచుగా చేతులు కడుక్కోవాలని కోరింది. ముఖాన్ని తాకకుండా ఉండటంతో పాటు  రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని పౌరులను కోరింది.
  • ప్రస్తుతం ఆందోళనకర పరిస్థితులేం లేవని రాజస్థాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే రాష్ట్రంలోని వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరింది. అంటు వ్యాధులు వ్యాప్తి చెందకుండా నిరోధించాలని తెలిపింది. ఈమేరకు రాష్ట్రంలోని పీడియాట్రిక్ యూనిట్లు, మెడిసిన్ విభాగాలలో ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
  • చైనాలో నెలకొన్న ఆరోగ్య సంక్షోభం నేపథ్యంలో తమ రాష్ట్రంలో ముందుజాగ్రత్త చర్యలను ప్రారంభించామని గుజరాత్ ఆరోగ్యశాఖ మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. శ్వాస సంబంధిత వ్యాధుల చికిత్సతో ముడిపడిన మౌలిక సదుపాయాలు, వైద్య వనరుల సంసిద్ధతను సమీక్షించాలని అధికారులను రాష్ట్ర సర్కారు ఆదేశించింది.

We’re now on WhatsApp. Click to Join.

  • ఉత్తరాఖండ్‌లోని  చమోలి, ఉత్తరకాశీ, పితోరాఘర్ జిల్లాలు చైనా బార్డర్‌లో ఉన్నాయి. దీంతో అక్కడి  ప్రజల్లో తలెత్తే శ్వాస కోశ సమస్యలపై రాష్ట్ర వైద్య యంత్రాంగం స్పెషల్ ఫోకస్ పెట్టింది.
  • ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో నమోదయ్యే శ్వాస కోశ సమస్యల కేసులను ఎప్పటికప్పుడు ప్రభుత్వ ఆరోగ్య విభాగానికి అందించాలని హర్యానా ఆరోగ్య శాఖ ఆదేశించింది.
  • శ్వాసకోశ సమస్యలతో ఆస్పత్రులకు వచ్చే కేసులపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని తమిళనాడు సర్కారు ఆదేశించింది. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు గైడ్‌లైన్స్ ఇష్యూ(6 States Alert) చేసింది.

Also Read: WhatsApp Channels : వాట్సాప్ ఛానల్స్‌లో రెండు కొత్త ఫీచర్లు