Site icon HashtagU Telugu

Kaushambi Blast: బాణసంచా ఫ్యాక్టరీ పేలుడు ఘటనలో ఆరుగురు మృతి

Kaushambi Blast

Kaushambi Blast

Kaushambi Blast: ఉత్తరప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. కాన్పూర్ హైవేపై కోఖ్‌రాజ్ సమీపంలోని బాణాసంచా ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దీని కారణంగా ఆరుగురు మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులని స్థానిక ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు, అడ్మినిస్ట్రేషన్ మరియు ఆరోగ్య శాఖ బృందం సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఫ్యాక్టరీ చట్టబద్ధతతో సహా ఇతర వాస్తవాలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనతో గ్రామంలో పరిస్థితి విషమంగా ఉంది.

కౌశాంబిలోని ఖలీలాబాద్‌లో నివాసముంటున్న షరాఫత్ అలీకి కోఖ్‌రాజ్ సమీపంలో పటాకుల ఫ్యాక్టరీ ఉంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 15 నుంచి 20 మంది కార్మికులు ఫ్యాక్టరీలో పని చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు శబ్దం వచ్చింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కౌశాంబి పోలీస్ సూపరింటెండెంట్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ బాణసంచా కర్మాగారంలో అగ్నిప్రమాదం జరిగింది. ప్రమాదంలో నలుగురు మరణించారు, కొందరు గాయపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన సమాచారం అందించారు.

Also Read: Food Crisis : గాజాలో ఆహార సంక్షోభం.. ఆకలి తీరుస్తున్న కలుపుమొక్క గురించి తెలుసా ?