550 Jobs : రైల్వేలో 550 జాబ్స్.. టెన్త్ పాసై, ఆ సర్టిఫికెట్ ఉంటే చాలు

550 Jobs : ఇండియన్ రైల్వేస్​లో ఉద్యోగం చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు.

Published By: HashtagU Telugu Desk
550 Jobs

550 Jobs

550 Jobs : ఇండియన్ రైల్వేస్​లో ఉద్యోగం చేయాలని చాలా మంది కలలు కంటూ ఉంటారు. అలాంటి వారికి మంచి అవకాశమిది. పంజాబ్​లోని కపుర్తలాలో ఉన్న రైల్​ కోచ్ ఫ్యాక్టరీలో 550 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.  మొత్తం 550 పోస్టులలో(550 Jobs).. ఫిట్టర్  200, వెల్డర్​ (G&E) – 230, ఎలక్ట్రీషియన్​ – 75, పెయింటర్​ (G) – 20, ఏసీ& రిఫ్రిజిరేషన్ మెకానిక్ – 15, మెషినిస్ట్ – 5, కార్పెంటర్​ – 5 ఉన్నాయి. పదో తరగతి పాసై, సంబంధిత ట్రేడ్​లో నేషనల్​ ట్రేడ్ సర్టిఫికెట్​ పొందిన వారు అప్లై  చేయొచ్చు. అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.100. మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

We’re now on WhatsApp. Click to Join

ఆసక్తి కలిగిన అభ్యర్థులు రైల్​ కోచ్​ ఫ్యాక్టరీ అధికారిక వెబ్​సైట్  https://pardarsy. railnet.gov.in /apprentice/ ద్వారా అప్లై చేయాలి. ఈ వెబ్‌సైట్ హోం పేజ్​లోని RCF Apprentice Apply Linkపై క్లిక్ చేయాలి. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 11న ప్రారంభమైంది. ఏప్రిల్ 9 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అవసరమైన వివరాలన్నీ నమోదు చేసి రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తి చేయాలి. మీకొక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్​వర్డ్ క్రియేట్ అవుతాయి. వాటిని ఉపయోగించి వెబ్​సైట్​లోకి మళ్లీ లాగిన్ కావాలి. జాబ్‌ను అప్లై చేసేటప్పుడు మీకు అర్హతలన్న అప్రెంటీస్​ ట్రేడ్​ను ఎంచుకోవాలి. దరఖాస్తు పత్రంలో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేయాలి. ముఖ్యమైన పత్రాలన్నీ అప్లోడ్ చేయాలి. దరఖాస్తు రుసుము కూడా ఆన్​లైన్​లోనే కట్టాలి.

Also Read : EC Issued Notices To Chandrababu : చంద్రబాబు కు ఈసీ షాక్..

  Last Updated: 19 Mar 2024, 01:33 PM IST