Site icon HashtagU Telugu

Rajasthan : టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ పేప‌ర్ లీక్ కేసులో 55 మంది అరెస్ట్‌

Crime

Crime

సెకండ్ గ్రేడ్ టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష పేపర్ లీక్‌లో ప్రధాన సూత్రధారి సహా 55 మందిని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. పరీక్షకు ముందు అభ్యర్థులకు కొన్ని లక్షల రూపాయలు తీసుకుని ..వారికి ప్రశ్నలను అందించినట్లు ఉదయ్‌పూర్ ఎస్పీ వికాస్ శర్మకు సమాచారం అందింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పరీక్షకు ముందు అభ్యర్థులను బస్సులో ఎక్కించుకునేందుకు ముఠా ప్రమేయం ఉందని… అభ్యర్థులను ఉదయ్‌పూర్‌లో దించే ముందు వారికి ప్రశ్నలు అందించాలని..సమాధానాలతో వారికి సహాయం చేయాలని వారు ప్లాన్ చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు పక్కా ప్లాన్‌ వేసి చీటింగ్‌ రాకెట్‌ నడుపుతున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (RPSC) శనివారం ఉదయం పేపర్ లీక్ కావడంతో జనరల్ నాలెడ్జ్ 2022 సెకండ్ గ్రేడ్ టీచ‌ర్ రిక్రూట్‌మెంట్ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది.

RPSC 2వ-గ్రేడ్ పేపర్ 2022 ప్రారంభానికి ముందు సోషల్ మీడియాలో ప్రసారం చేయబడింది. దీనితో పరీక్షను రద్దు చేశారు.

Exit mobile version