ఢిల్లీ పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలని ఆశపడుతున్న అభ్యర్థులకు ఇది కీలక సమయం. హెడ్ కానిస్టేబుల్ (మినిస్టీరియల్) పోస్టుల భర్తీ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అక్టోబర్ 20వ తేదీతో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. మొత్తం 509 పోస్టులు భర్తీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో పురుషులకు 341, మహిళలకు 168 ఉద్యోగాలు కేటాయించబడ్డాయి. కనీస విద్యార్హతగా ఇంటర్ (10+2) పాస్ అయి ఉండాలి. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఉద్యోగం కావడంతో దేశంలోని ఏ రాష్ట్ర అభ్యర్థులైనా అర్హులు.
Kaps Cafe Attack : కపిల్ శర్మ కేప్పై మరోసారి కాల్పులు
వయస్సు పరిమితి విషయంలో 18 నుండి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు కేంద్ర నిబంధనల ప్రకారం వయస్సులో రాయితీ ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక మూడు దశల్లో జరుగుతుంది మొదట రాతపరీక్ష, తర్వాత Physical Endurance & Measurement Test (PE&MT), చివరగా స్కిల్ టెస్ట్ (టైపింగ్ టెస్ట్) నిర్వహిస్తారు. రాతపరీక్షలో సాధారణ అవగాహన, రీజనింగ్, మ్యాథమెటిక్స్, కంప్యూటర్ నాలెడ్జ్ వంటి విభాగాలపై ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష ఫీజును ఆన్‌లైన్ పేమెంట్ మోడ్‌లో చెల్లించవచ్చు. దరఖాస్తు ప్రక్రియలో తప్పులు లేకుండా పూర్తి వివరాలను నమోదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఢిల్లీ పోలీస్ విభాగం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన సంస్థగా ఉన్నందున, ఈ నియామకాలు మంచి కెరీర్ అవకాశంగా భావించవచ్చు. రాబోయే మూడు రోజుల్లో దరఖాస్తు పూర్తి చేసుకోవడం ద్వారా అభ్యర్థులు ప్రభుత్వ సేవలోకి ప్రవేశించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.