Narendra Modi : భారతదేశ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా గుర్తించబడే ఎమర్జెన్సీ విధింపుకు నేటితో సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ “సంవిధాన్ హత్యా దివస్”గా ఆచరిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ప్రధాని మోదీ, “ఎమర్జెన్సీ అనే చీకటి అధ్యాయం భారత ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడం, రాజ్యాంగ స్ఫూర్తిని భంగం చేయడం జరిగింది,” అని అన్నారు. 1975 జూన్ 25న విధించిన అత్యవసర పరిస్థితి భారతీయులు మర్చిపోలేరని, ఆ సమయంలో ప్రజల హక్కులను హరించారని విమర్శించారు.
Dating : హార్దిక్ పాండ్యతో డేటింగ్? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పార్లమెంట్‌ను మౌనముచేసిందని, న్యాయవ్యవస్థను నియంత్రించేందుకు ప్రయత్నించిందని మోదీ ఆరోపించారు. 42వ రాజ్యాంగ సవరణ ఈ దుర్మార్గానికి నిదర్శనమని పేర్కొన్నారు. “పేదలు, దళితులు, అణగారిన వర్గాలపై వేధింపులు జరిపారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పోరాడిన ప్రతి ఒక్కరికి మా వందనం,” అని ఆయన అన్నారు. అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా ప్రజలు సమిష్టిగా పోరాడటం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందని, ఆ ఎన్నికల్లో వారిని ఓడించడం ప్రజాస్వామ్య విజయాన్ని చూపించిందన్నారు. “మన రాజ్యాంగంలోని మూల సూత్రాలను బలోపేతం చేస్తూ, వికసిత్ భారత్‌ను సాధించేందుకు కృషి చేస్తున్నాం. పేదలూ, అణగారిన వర్గాల కలల్ని నెరవేర్చడమే మా లక్ష్యం,” అని మోదీ ట్వీట్ చేశారు.
Sourav Ganguly: ఐసీసీ చైర్మన్ జై షాపై గంగూలీ సంచలన వ్యాఖ్యలు!