Site icon HashtagU Telugu

Delhi:తల్లి కాదు..రాక్షసి..ఐదేళ్ల బాలిక హోం వర్క్ చేయలేదని ఎంత పనిచేసిందో తెలుసా..?

23 62a0e4cec3238

23 62a0e4cec3238

మనకు ఏదైనా జరిగితే..అమ్మ విలవిలాడిపోతోంది. చిన్నపిల్లలు ఏడుస్తుంటే..అయ్యే నా బిడ్డకు ఏమైందంటూ కంగారుపడిపోతుంది. అలాంటి తల్లి కర్కశంగా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది. హోం వర్క్ చేయలేదన్న ఆగ్రహంతో ఐదేళ్ల కుమారుడిపై కర్కశంగా ప్రవర్తించింది. బాలుడి కాళ్లు, చేతులు కట్టెసి మిట్టమధ్యాహ్నం మిద్దెపై వదిలేసింది. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎండవేడిమికి తట్టుకోలేక బాలుడు గుక్కపట్టి ఏడుస్తున్నతీరును చూస్తు నెటిజన్ల కన్నీళ్లు పెట్టుకుంటున్నారు.బాలుడు ఒకటో తరగతి చదువుతున్నట్లు సమాచారం. ఢిల్లీలోని టుకుమీర్ పూర్ లో వీళ్ల కుటుంబం నివసిస్తోంది.

మిద్దెపై నుంచి బాలుడు ఏడుపులు వినిపించడంతో చూసిన పక్కింటివాళ్లు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.ఢిల్లీ కమిషనర్ రాకేశ్ ఆస్థానా, ఢిల్లీ మహిళా కమిసన్ చీఫ్ స్వాతి మాలివాల్ కు ట్యాగ్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు ఆ తల్లిపై మండిపడ్డారు. ఆమె పైచర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు బాలుడి తల్లిమీద కేసు నమోదు చేశారు. బాధిత బాలుడి కుటుంబాన్ని గుర్తించామని..తల్లిపై చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు.

Exit mobile version