5 States Exit Poll : 5 రాష్ట్రాల్లో బీజేపీ ఔట్‌, ‘ఆత్మ‌సాక్షి’ ఎగ్జిట్ పోల్‌

ఆత్మ‌సాక్షి స‌ర్వే ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే ప్ర‌కారం బీజేపీ ఐదు రాష్ట్రాల్లోనూ ఓడిపోనుంది.

  • Written By:
  • Updated On - March 7, 2022 / 08:27 PM IST

ఆత్మ‌సాక్షి స‌ర్వే ఎగ్జిట్ పోల్స్ స‌ర్వే ప్ర‌కారం బీజేపీ ఐదు రాష్ట్రాల్లోనూ ఓడిపోనుంది. ప్ర‌ధానంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ఎస్పీ, బీజేపీకి మ‌ధ్య ఓట్ల గ్యాంప్ కూడా ఎక్కువ‌గా ఉంది. ఆ సర్వే ప్ర‌కారం బీజేపీకి 32. 5శాతం మాత్ర‌మే ఓటు బ్యాంకు ఉండ‌గా, ఎస్పీకి 39.5శాతం ఉంద‌ని అంచ‌నా వేసింది. ఆ లెక్క ప్ర‌కారం దాదాపు ఏడు శాతం అద‌నంగా ఓటు బ్యాంకు అఖిలేష్ పొంద‌బోతున్నాడు. ఇక సీట్ల విష‌యానికి వ‌స్తే, ఎస్పీ 235 నుంచి240 వ‌ర‌కు పొంద‌వ‌చ్చ‌ని తేల్చింది. బీజేపీ మాత్రం 138 నుంచి 140 వ‌ర‌కు ప‌రిమితం కానుంద‌ని ఆ స‌ర్వే సారాంశం.పంజాబ్ రాష్ట్రంలో బీజేపీ ఉనికి ఎక్క‌డా క‌నిపించ‌డంలేదు. కాంగ్రెస్, ఆప్ మ‌ధ్య నువ్వా? నేనా? అన్న‌ట్టు పోటీ ఉంద‌ని స‌ర్వే చెబుతోంది. కాంగ్రెస్ 32.5 శాతం, ఆప్ 29.5శాతం ఓటు బ్యాంకును పొందే అవ‌కాశం ఉండ‌గా, బీజేపీ కేవ‌లం 9.5శాతం ఓటు బ్యాంకుతో ఉంది. శిరోమ‌ణి అకాళిద‌ల్ మాత్రం 25.5శాతం ఓటు బ్యాంకుతో ఉంద‌ని ఆత్మ‌సాక్షి చెబుతోంది. ఆ ప్ర‌కారం కాంగ్రెస్ కు 58 నుంచి 61, ఆప్ 34 నుంచి 38, శిరోమ‌ణి అకాళిద‌ల్ కూట‌మికి 18నుంచి 21 బీజేపీ కి కేవ‌లం 4 నుంచి 5 సీట్లు వ‌ర‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

ఉత్త‌రాఖండ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఆ పార్టీకి 46శాతం ఓటు బ్యాంకు ఉంటుంద‌ని అంచ‌నా వేసింది. బీజేపీ 40.5శాతం ఓటు బ్యాంకును క‌లిగి ఉంటుంద‌ని స‌ర్వే సారాంశం. సీట్ల వాటాకు వ‌స్తే కాంగ్రెస్ 43 నుంచి 47 మ‌ధ్య ఉండే అవ‌కాశం ఉంది. అదే, బీజేపీ 20 నుంచి 21 సీట్ల‌ను మాత్ర‌మే పొంద‌నుంది. ఆప్ ఆ రాష్ట్రంలో 2 నుంచి మూడు సీట్ల‌ను సాధిస్తుంద‌ని ఆత్మ‌సాక్షి అంచ‌నా వేస్తోంది.

గోవా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 45శాతం ఓటు బ్యాంకుతో 21 నుంచి 22 స్థానాల‌ను కైవ‌సం చేసుకునే అవ‌కాశం ఉంది. బీజేపీ 34శాతం ఓటు బ్యాంకుతో కేవ‌లం 9 నుంచి 10 స్థానాల‌కు ప‌రిమితం అవుతుంద‌ని స‌ర్వే చెబుతోంది. ఆప్ గోవాలో 2 నుంచి 3 స్థానాల‌ను కైవ‌సం చేసుకోనుంది. అదే, మ‌ణిపూర్ లో నువ్వా నేనా అన్న‌ట్టు బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య పోటీ ఉంటుంద‌ని స‌ర్వే తేల్చింది. రెండు పార్టీల‌కు మ‌ణిపూర్ నెక్ టూ నెక్ ఉంటుంద‌ని ఆత్మ‌సాక్షి చెబుతోంది.
మొత్తం మీద నాలుగు రాష్ట్రాల్లోనూ బీజేపీ అధికారంలోకి వ‌చ్చే ఛాన్స్ లేదు. కాంగ్రెస్ మాత్రం పంజాబ్ ను నిలుపుకోవ‌డంతో పాటు మిగిలిన మూడు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేలా స‌ర్వే ఉంది. మ‌ణిపూర్ మాత్రం చివ‌రి నిమిషం వ‌ర‌కు స‌స్సెన్స్ కొన‌సాగే అవ‌కాం ఉంది.

 

Download Survey Here 

 

*Hashtag U Doesnt Endorse this survey. Survey is done by Atma Sakshi Group.