Site icon HashtagU Telugu

Look Back 2024: సుప్రీంకోర్టు ఇచ్చిన 5 సంచలనాత్మక తీర్పులు

Sc 5 Sensational Judgments

Sc 5 Sensational Judgments

మరో వారంలో కొత్త ఏడాదిలోకి(2025) అడుగుపెట్టబోతున్నాం. ఈ క్రమంలో ఈ ఏడాది(2024)లో జరిగిన కీలక అంశాల పట్ల అంత మాట్లాడుకుంటున్నారు. వాటిలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన 5 సంచలనాత్మక తీర్పులు (Sensational Judgments) ఏంటి అనేవి మీకు తెలియజేస్తున్నాము. బిల్కిస్ బానో కేసులో నిందితుల బెయిల్ రద్దు, ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగవ్యతిరేకమని తేల్చడం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్పు, బుల్డోజర్ న్యాయంపై కీలక సూచనలు ఈ ఏడాది ప్రధాన తీర్పులుగా నిలిచాయి. ఈ తీర్పులు భారత న్యాయవ్యవస్థకు, రాజ్యాంగ స్ఫూర్తికి, సామాన్య ప్రజల హక్కులకు ముఖ్యమయిన అవగాహనను కలిగించాయి.

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేయడం ద్వారా బాధితురాలి హక్కులకు అనుకూలంగా నిలిచింది. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించి నిందితులను మళ్లీ జైలుకు పంపడం ద్వారా న్యాయం నిలబెట్టింది. ఈ తీర్పు రాజ్యాంగం పట్ల న్యాయవ్యవస్థ కట్టుబాటును చాటిచెప్పింది.

ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ బాండ్లు రాజ్యాంగానికి విరుద్ధమని, ప్రజలు తమ ఓటు హక్కును సమర్థవంతంగా వినియోగించుకోవాలంటే రాజకీయ పార్టీలు పొందుతున్న నిధుల వివరాలు అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. ఇది పారదర్శకతకు మద్దతుగా రాజ్యాంగ పరిరక్షణను చాటిచెప్పిన తీర్పుగా నిలిచింది.

ఎస్సీల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం మరింత చర్చనీయాంశమైంది. ఉపవర్గీకరణ రాజ్యాంగానికి అనుగుణంగా ఉందని పేర్కొంటూ గత తీర్పులను సవరించింది. ఈ తీర్పు ఎస్సీ వర్గాల మధ్య సమాన అవకాశాలు కల్పించడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది.

యూపీ సహా పలు రాష్ట్రాల్లో బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు కీలకంగా స్పందించింది. ఆరోపణల ఆధారంగా ఇళ్లు కూల్చివేయడం రాజ్యాంగానుసారం కాదని, న్యాయ విచారణ లేకుండా చర్యలు తీసుకోవడం తగదని స్పష్టం చేసింది. ఈ తీర్పు పౌరుల హక్కులను, రాజ్యాంగ సూత్రాలను రక్షించడానికి మార్గం చూపింది.

Read Also : Afghan Women Cricketers : తాలిబన్ల ఐరన్ లెగ్.. ఆఫ్ఘనిస్తాన్ మహిళా క్రికెటర్ల దీనగాథ