Tourist Places: జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన అత్యంత ప్రసిద్ధమైన ఐదు పర్యాటక ప్రదేశాలు..

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 12:45 PM IST

 

Indian Tourist Places: ఎత్తైన పర్వతాలు, సహజ సౌందర్యం, జలపాతాలు, బీచ్‌లు, సందడిగా ఉండే నగరాలు, నిశ్శబ్ద చారిత్రక చిహ్నాలు, సాంస్కృతికంగా గొప్ప నిర్మాణాన్ని ఆస్వాదించేందుకు అనేక ప్రాంతాలున్నాయి. మీరు స్నేహితులు, కుటుంబం లేదా సోలోగా టూరిస్ట్ స్పాట్‌కి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటే భారతదేశంలోని 5 పర్యాటక ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్. కనుక నేడు జీవితంలో ఒక్కసారైనా సందర్శించాల్సిన అత్యంత ప్రసిద్ధమైన ఐదు పర్యాటక ప్రదేశాలను తెలుసుకుందాం..

కొందరికి ఏ మాత్రం సెలవులు దొరికినా వెంటనే ప్రకృతి అందలను వీక్షించాలని.. సరికొత్త ప్రాంతాలకు వెళ్లాలని కోరుకుంటారు. అయితే ఎక్కడకు, ఎలా వెళ్లాలనే దానిపై చర్చ మొదలవుతుంది. భారతదేశంలో పర్యాటకులు ఎంచుకోవడానికి అనేక అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఎత్తైన పర్వతాలు, సహజ సౌందర్యం, జలపాతాలు, బీచ్‌లు, సందడిగా ఉండే నగరాలు, నిశ్శబ్ద చారిత్రక చిహ్నాలు, సాంస్కృతికంగా గొప్ప నిర్మాణాన్ని ఆస్వాదించేందుకు అనేక ప్రాంతాలున్నాయి. మీరు స్నేహితులు, కుటుంబం లేదా సోలోగా టూరిస్ట్ స్పాట్‌కి వెళ్లడానికి ప్లాన్ చేసుకుంటే భారతదేశంలోని 5 పర్యాటక ప్రదేశాలు బెస్ట్ ఆప్షన్. కనుక ఈ రోజు భారతదేశంలోని ఉత్తమ పర్యాటక ప్రదేశాలను తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join.

< భూతల స్వర్గం కాశ్మీర్(Kashmir)ప్రయాణానికి ఉత్తమమైన ప్రదేశం. నగరం సౌదర్యం ప్రపంచం నలుమూలలో ఉన్న పర్యాటకులను ఆకర్షిస్తుంది. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాలని ప్లాన్ చేస్తే కాశ్మీర్ వెళ్లవచ్చు. ఇక్కడ మీరు నదులు, సుందరమైన జలపాతాలు, లోయలు, పచ్చని అడవులను చూస్తూ మైమరచిపోతారు.

< కూర్గ్(Coorg)కూడా చాలా అందమైన ప్రదేశం. మీరు దైనందిన జీవితం, నగర రణగొణ ధ్వనులకు దూరంగా ఉండాలనుకుంటే కూర్గ్ వెళ్లాల్సిన ప్రదేశం. కూర్గ్ చుట్టూ పచ్చదనం, ప్రకృతి అందంగా ఉంటుంది. కర్నాటక కొండల్లో నెలకొని ఉన్న కూర్గ్ సాటిలేని అందమైన పచ్చదనం, కాఫీని ఉత్పత్తి చేసే హిల్ స్టేషన్లకు ప్రసిద్ధి చెందింది.

కనుక ఎక్కడికైనా ప్రయాణం చేయాలనుకుంటే కూర్గ్ కూడా ఒక గొప్ప ఎంపిక. కూర్గ్‌లో ట్రెక్కింగ్ చేసిన తర్వాత, మీరు అబ్బే జలపాతం, బారాపోల్ నది, బ్రహ్మగిరి శిఖరం, ఇరుప్పు జలపాతం, నాగర్‌హోల్ నేషనల్ పార్క్ వంటి అనేక ప్రదేశాలను సందర్శించడానికి ప్లాన్ చేసుకోవచ్చు.

< అస్సాం(Assam)కూడా పర్యటనకు ప్రయాణానికి ఉత్తమమైన ప్రదేశం. అనేక పర్వతాలు, బీచ్‌లను చూడాలనుకుంటే అస్సాం వెళ్ళవచ్చు. ఆధ్యాత్మిక వాతావరణంలో ప్రశాంతమైన అందం, ప్రశాంతతను అనుభవించడానికి అస్సాంను సందర్శించవచ్చు. అస్సాంలో అనేక వన్యప్రాణుల అభయారణ్యాలు ఉన్నాయి.ఈ అడవులు ఖడ్గమృగాలకు నిలయం.

< మనాలి(Manali)సందర్శన కోసం కూడా ఒక గొప్ప ఎంపిక. స్నేహితులతో కలిసి మనాలికి వెళుతున్నట్లయితే మీ జీవితంలో అత్యుత్తమ యాత్రగా చెప్పవచ్చు. బియాస్ నది, చుట్టూ ఉన్న పర్వతాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, అందంతో మనాలి పర్యాటకుల హృదయాలను గెలుచుకుంది. స్నేహితులతో మొదటి ట్రిప్ ప్లాన్ చేసుకునే వారు లేదా ఒంటరిగా ప్రయాణించే వారు తప్పక మనాలిని సందర్శించి జీవితకాలపు అందమైన అనుభూతిని జ్ఞాపకాలుగా పదిల పరచుకోవచ్చు.

< జైసల్మేర్ నగరం(Jaisalmer city)అందం మంత్రముగ్దులను చేస్తుంది. రాజస్థాన్‌లోని ప్రధాన పర్యాటక ప్రదేశాలలో జైసల్మేర్ ఒకటి. అద్భుతమైన కోటలు, ఎడారులు, దేవాలయాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడ అప్పటి రాజులకు చెందిన ప్యాలెస్‌లను కూడా సందర్శించవచ్చు. కుటుంబ సమేతంగా సందర్శించేందుకు జైసల్మేర్ చక్కని ప్రదేశం.

read also : Power Cuts : తెలంగాణలో రైతులకు కరెంటు కష్టాలు..?