Site icon HashtagU Telugu

Encounter : ఐదుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

Encounter

Encounter

Encounter : జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు లష్కరే తైబా ఉగ్రవాదులు హతమయ్యారు. దమ్‌హాల్ హంజి పోరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం గురువారం రాత్రి అందడంతో.. భద్రతా బలగాలు వెంటనే అక్కడికి చేరుకొని కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈక్రమంలో భద్రతా సిబ్బందిపైకి ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. రాత్రంతా కాల్పులు, ప్రతి కాల్పులు జరగగా..  శుక్రవారం తెల్లవారుజామున ఆర్మీ కాల్పుల్లో ఐదుగురు లష్కరే తైబా టెర్రరిస్టులు హతమయ్యారు.ఆర్మీకి చెందిన 34 రాష్ట్రీయ రైఫిల్స్, పోలీసులు, సీఆర్పీఎఫ్ ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి.

We’re now on WhatsApp. Click to Join.

అక్టోబరు నెలలోనూ కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు . వారికి హిజ్బుల్ ముజాహిదీన్‌ ఉగ్రవాదులతో సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద నుంచి ఉరీ సెక్టార్‌లోకి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల చొరబాట్లు ఇటీవల పెరిగాయి. దీంతో వారిని గుర్తించి, నిరోధించేందుకు భారత ఆర్మీ గస్తీని ముమ్మరం చేసింది. ప్రత్యేకించి  కుల్గాం జిల్లాలో పాక్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించడం ఇటీవలకాలంలో(Encounter)  ఇది రెండోసారి.