జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లా(Doda District)లో తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న టెంపో ట్రావెలర్ (Tempo Travelle) లోయలో పడిపోవడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొండ ప్రాంతం గుండా వాహనం ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం నిటారుగా ఉన్న వాలుపైకి దూసుకెళ్లి లోయలోకి పడిపోయినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాద సమయంలో వాహనంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించగా, శిథిలాల్లో చిక్కుకున్నవారిని వెలికితీసేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ హర్విందర్ సింగ్ పర్యవేక్షిస్తున్నారని సమాచారం. భర్ట్ గ్రామం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
Skin wrinkles : వయస్సు కన్నా ముందే చర్మం ముడతలు పడుతుందా?..కారణాలు ఏంటో.. నివారించేందుకు చిట్కాలు ఏంటో చూసేద్దాం!
ఈ దుర్ఘటనపై కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారికి అవసరమైన వైద్య సహాయం, ఆర్థిక సాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు. డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ఘటనపై అధికారుల నుంచి తాను నేరుగా సమాచారం తీసుకుంటున్నానని, అవసరమైనంత వరకూ సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ ఘోర ప్రమాదం మరోసారి కొండ ప్రాంతాల్లో రహదారి భద్రతపై శ్రద్ధ అవసరమని తెలియజేస్తోంది.