Sensational Decision : ఆ సీఎం సంచలన నిర్ణయం..వారానికే 5రోజులే పనిదినాలు..!!

వారానికి ఐదురోజులు మాత్రమే పనిచేసే సౌలభ్యం. ఇది ఎక్కువగా ఐటీ కంపెనీల్లోనే కనిపిస్తుండటం తెలిసిన సంగతే.

Published By: HashtagU Telugu Desk
Biren Singh

Biren Singh

వారానికి ఐదురోజులు మాత్రమే పనిచేసే సౌలభ్యం. ఇది ఎక్కువగా ఐటీ కంపెనీల్లోనే కనిపిస్తుండటం తెలిసిన సంగతే. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇదే విధానాన్ని అమలు చేసినట్లయితే ఎలా ఉంటుంది.? ఈ గుడ్ న్యూస్ చెప్పారు మణిపూర్ ముఖ్యమంత్రి. వారంలో ఐదు రోజులే పనిదినాలంటూ తాజాగా అమల్లోకి తీసుకువచ్చింది మణిపూర్ ప్రభుత్వం. ఏప్రిల్ ఒకటవ తారీఖు నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు..ఏజెన్సీలు..ప్రభుత్వ రంగ సంస్థలు కూడా సోమవారం నుంచి శుక్రవారం వరకే పనిచేయనున్నాయి. ఈ మధ్యే మణిపూర్ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించిన బీరెన్ సింగ్ ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

ఇక తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం…రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక వెకేషన్ శాఖకు తప్పించి…మిగిలిన శాఖల్లోని ఉద్యోగులంతా ఇకపై వారానికి ఐదురోజులు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు జారీచేశారు. ఇక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పనివేళల్లోనూ మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. మార్చి నుంచి అక్టోబర్ వరకు ఉదయం 9 గంటలకు ప్రారంభం అయ్యే కార్యాలయాలు సాయంత్రం ఐదున్నర గంటల వరకు కొనసాగుతాయి. అయితే నవంబర్ నుంచి మొదలయ్యే శీతాకాలన్ని పరిగణలోకి తీసుకుని ఉదయం 9 గంటలకు మొదలయ్యే కార్యాలయాలు సాయంత్రం మాత్రం మరో అరగంట ముందే ముగిసేలా నిర్ణయం తీసుకుంది.

ఎప్పటిమాదిరిగానే వచ్చే లంచ్ బ్రేక్ కు మాత్రం అరగంట సమయం ఇచ్చారు. ఏదిఏమైనప్పటికీ వారానికి ఐదు రోజుల పనివిధానం ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అనే చెప్పక తప్పదు. తమ రాష్ట్రంలో మాదిరి మారే రాష్ట్రంలోనూ సంక్షేమ పథకాలన్ని అమలు చేయరని చెప్పే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్…తమ ప్రభుత్వ ఉద్యోగుల పనిరోజులను ఆరో నుంచి ఐదు రోజులకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంటారన్న ప్రశ్న వినిపిస్తోంది.

  Last Updated: 28 Mar 2022, 03:09 PM IST