Site icon HashtagU Telugu

Independence day : ఆగస్టు 15 న ఇండియా తో పాటు మరో నాల్గు దేశాల్లో స్వాతంత్య్ర వేడుకలు

5 Countries That Celebrate Independence Day on August 15

5 Countries That Celebrate Independence Day on August 15

ఆగస్టు 15 (Independence day) అంటే చాలు భారతీయులకు పెద్ద పండగ చేసుకుంటారు. దాదాపు 200 ఏళ్ల వలస పాలనకు చరమగీతం పాడిన రోజు ఆగస్టు 15. ఈరోజు భారతీయుల స్వయంపాలనకి తెరలేచింది. అందువల్ల ప్రతీ సంవత్సరం ఆగస్ట్ 15 భారతీయులందరికీ జాతి, కుల, మత, వర్గాలకు అతీతంగా పండుగరోజు.

వేల మంది అమరవీరుల త్యాగం ఫలితంగా మనదేశానికి స్వాతంత్య్రం వచ్చింది. దాదాపు 200 ఏళ్ల వలస పాలనలో భారతదేశం ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా తీవ్రంగా నష్టపోయింది. ఆ తరువాత క్రమంగా దేశ ప్రజల్లో చైతన్యం పెరిగింది. వలస పాలనకు వ్యతిరేకంగా ఒక్కటవ్వడం ప్రారంభించారు. తమకు సాధ్యమైన విధానాల్లో పోరాటం సాగించారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన తరువాత.. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఐక్య పోరాటానికి ఒక వేదిక లభించింది. ఆ తరువాత, మహాత్మా గాంధీ సమర్థ నాయకత్వంలో దేశమంతా ఒక్కటిగా సత్యాహింసలు ఆయుధాలుగా పోరాటం సాగించింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అహింసాయుత మార్గంలో భారత్ స్వాతంత్రం సంపాదించింది. ఆగస్టు 15 న మన దేశం మాత్రమే కాదు బహ్రెయిన్(Bahrain), ఉత్తర కొరియా(North Korea), దక్షిణ కొరియా ( South Korea)లీచ్‌టెన్‌స్టెయిన్ (Liechtenstein),ఆఫ్రియా దేశమైన కాంగో (Republic of the Congo)దేశాలు కూడా తమ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి.

బహ్రయిన్ (Bahrain ) :

ఇది ఒక చిన్న ద్వీపదేశం. ఇది మిడిల్ ఈస్ట్ లోని పర్షియన్ గల్ఫ్ పశ్చిమతీరంలో ఉంది. ఇది భ్రయిన్ ద్వీపంతో చేరిన ద్వీపసమూహం. ఇది 55 కి.మీ పొడవు 18 కి.మీ వెడల్పు ఉంటుంది. పశ్చిమ సరిహద్దులో ఉన్న సౌదీ అరేబియా ” కింగ్ ఫహ్ద్ కౌస్వే ” ద్వారా బహ్రయిన్‌తో అనుసంధానించబడి ఉంది. ఉత్తర దిశలో ఉన్న ఇరాన్ బహ్రయిన్ మద్య 200 కి.మీ పొడవైన పర్షియన్ గల్ఫ్ ఉంది.ఆగ్నేయంలో ఉన్న కతర్ ద్వీపకల్పం బహ్రయిన్ మద్య గల్ఫ్ ఆఫ్ బహ్రయిన్ ఉంది.

ఇది కూడా ఎన్నో దేశాల వలే బ్రిటిష్ వలస పాలనను కూడా అనుభవించింది, భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన రెండు దశాబ్దాల తరువాత ఆగష్టు 15, 1971 న స్వాతంత్ర్యం ప్రకటించింది. బహ్రెయిన్‌లో స్వాతంత్య్రం బహ్రెయిన్ జనాభాపై ఐక్యరాజ్యసమితి సర్వేను అనుసరించింది. ఆ తర్వాత 1960 ప్రారంభంలో సూయెజ్‌కు తూర్పున ఉన్న సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని బ్రిటిష్ వారు ప్రకటించారు. బహ్రెయిన్‌లో స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో బహ్రెయిన్ దేశానికి..యూకేకు (గ్రేట్ బ్రిటన్)మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ తేదీన దేశం స్వాతంత్ర్య దినోత్సవాన్ని బహ్రెయిన్ జరుపుకోదు. దీనికి బదులుగా దివంగత పాలకుడు ఇసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా సింహాసనాన్ని అధిష్టించిన రోజుకు గుర్తుగా డిసెంబర్ 16 నేషనల్ డేగా జరుపుకుంటుంది. ఆరోజునే సెలవు దినంగా పాటిస్తుంది.

ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు (North Korea & South Korea ) :

ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాలు. ఈ రెండు దేశాలు ఏటా ఆగస్టు 15 ను జాతీయ విమోచన దినోత్సవంగా జరుపుకుంటాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన ఈ రోజున 35 సంవత్సరాల జపాన్ ఆక్రమణ ఉత్తర కొరియా దక్షిణ కొరియా దేశాలలో ముగిసింది. కొరియాపై వలస పాలన ముగిసింది. ఉత్తర, దక్షిణ కొరియాల కు మద్దతుగా యుద్ధంలో పోరాడిన మిత్ర దళాలు ఈ రెండు దేశాలను ఆక్రమణల నుంచి విముక్తులను చేశాయి. ఆగస్టు 15ని దక్షిణ కొరియాలో ‘గ్వాంగ్‌బోక్జియోల్’ గా పిలుస్తారు. అంటే కాంతి తిరిగి వచ్చిన రోజుగా పిలుస్తారు. ఉత్తరకొరియా మాత్రం ‘చోగుఖేబాంగై నల్’ అని పిలుస్తారు. అంటే ఫాదర్ల్యాండ్ డే విమోచనం రోజుగా భావిస్తారు.

లీచ్టెన్‌స్టెయిన్ (Liechtenstein) :

ప్రపంచంలోని ఆరవ అతి చిన్న దేశం లీచ్టెన్‌స్టెయిన్ (Liechtenstein). స్వతంత్య్రానికి ముందు ఈ దేశం జర్మనీ ఆధీనంలో ఉండేది. భారతదేశం కంటే ఎన్నో రెట్లు చిన్నదైన ఈ దేశం భారతదేశానికంటే ముందే 1940, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం సంపాదించింది. అప్పటి నుండి ఈ దేశ ప్రజలు ఆగస్టు 15ను ప్రత్యేకదినంగా జరుపుకుంటున్నారు. . ఆగస్టు 15న బ్యాంకు సెలవు దినంగా పాటిస్తుంది. అలాగే క్రీస్తు ఏసు తల్లి మేరీ మాత జన్మించిన ఊహను ఆగష్టు 15 నే జరుపుకుంటారు. అంతేకాదు వారికి స్వాతంత్ర్యం వచ్చే సమయంలో పాప్రిన్స్ ఫ్రాంజ్ జోసెఫ్ II, ఆగస్టు 16 న జన్మించారు. దీంతో లీచ్టెన్‌స్టెయిన్ జాతీయ సెలవుదినం పండుగను, ప్రిన్స్ పుట్టినరోజును కలిపి ఆగస్టు 15న జాతీయ దినంగా జరుపుకుంటుంది.

కాంగో (Republic of the Congo) :

కాంగో రిపబ్లిక్, కాంగో-బ్రాజావిల్లే అని కూడా పిలుస్తారు , ఇది పశ్చిమాన ఉన్న దేశం. కాంగో నదికి పశ్చిమాన మధ్య ఆఫ్రికా తీరం. ఇది పశ్చిమాన గాబోన్ , దాని వాయువ్యంగా కామెరూన్ మరియు ఈశాన్య సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ , ఆగ్నేయ సరిహద్దులో ఉందిడెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో , దాని దక్షిణాన అంగోలాన్ ఎక్స్‌క్లేవ్ ఆఫ్ కాబిండా మరియు దాని నైరుతి దిశలో అట్లాంటిక్ మహాసముద్రం ఉంది.

ఈ దేశం కూడా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ దేశం 1960లో ఆగస్టు 15న ఫ్రాన్స్ నుండి పూర్తీగా స్వాతంత్య్రంగా ప్రకటించబడింది. కాంగోను 1880లో ఫ్రాన్స్ ఆక్రమించింది. అప్పుడు దీనిని ఫ్రెంచ్ కాంగో అని పిలిచేవారు. 1960లో స్వతంత్రం వచ్చిన తరువాత మధ్య కాంగోలోని ఫ్రెంచి ప్రాంతమంతా కాంగో గణతంత్ర రాజ్యంగా మారింది.ఈ కాంగో మార్క్సిజం, లెనినిజం అవలంబించే ఏక పార్టీ రాజ్యంగా 1970 నుండి1991 వరకూ ఉంది.బహుళ పార్టీ ఎన్నికలు1992లో జరిగాయి.1997 అంతర్యుద్ధంలో ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని తీసేశారు.

ఇలా ఆగస్టు 15 న మనతో పాటు ఈ నాల్గు దేశాల ప్రజలు ఎంతో సంతోషంగా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటూ వస్తున్నారు.

Read Also : Independence Day 2023 : ఎన్నో స్వాతంత్ర్య‌దినోత్సవం? 76 లేదా 77.!