Site icon HashtagU Telugu

Students Condition: 48 శాతం మంది విద్యార్థులు కాలినడకనే బడికి : ఎన్ ఏ ఎస్ నివేదిక

Students

Students

దేశంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల స్థితిగతులు ఎలా ఉన్నాయి ? అనే దానికి సంబంధించి 2021 లో నిర్వహించిన నేషనల్ అచీవ్మెంట్ సర్వే(ఎన్ ఏ ఎస్) లో కీలక అంశాలు వెలుగు చూశాయి. దేశంలోని 48 శాతం మంది బాలలు రోజూ బడికి కాలినడకనే వెళ్తున్నారని వెల్లడైంది.
18 శాతం మంది పిల్లలు సైకిల్ పై స్కూల్ కు వెళ్తున్నారు. 8 శాతం మంది పిల్లలు బైక్/స్కూటర్ పై బడికి వెళ్తున్నారు.కేవలం 9 శాతం మందికే స్కూలు బస్సుల వసతి ఉందని గుర్తించారు. 3 శాతం మంది పిల్లలే తల్లిదండ్రుల కార్లలో స్కూల్ కు వెళ్లొస్తున్నారు. విద్యార్థులను ఇళ్ల వద్ద ఎలా చదివించాలి ? ఎలాంటి అభ్యసన సహకారం అందించాలి? అనే అంశంపై 87 శాతం పాఠశాలలు తల్లిదండ్రులకు సలహాలు ఇస్తున్నాయి. విద్యార్థుల వికాసానికి పాఠశాలలు చేస్తున్న ఈ ప్రయత్నాలకు 25 శాతం మంది తల్లిదండ్రులు సహకరించడం లేదని సర్వేలో తేలింది. 89 శాతం మంది పిల్లలు తాము బడుల్లో విన్న పాఠాల గురించి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో చర్చిస్తున్నారని గుర్తించారు.

ఇది అత్యంత సానుకూల పరిణామం. మన దేశ విద్యార్థులకు చదువులపై పెరుగుతున్న ఆసక్తికి ఇది నిదర్శనం. కాగా, దేశంలోని 720 జిల్లాలకు చెందిన 1.18 లక్షల స్కూళ్లలో చదువుకునే 34 లక్షల మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు.

Exit mobile version