Site icon HashtagU Telugu

Gaganyaan – 48 Sites : ‘గగన్‌యాన్‌’ వ్యోమగాముల ల్యాండింగ్‌కు 48 సైట్లు.. ఎందుకు ?

Gaganyaan 48 Sites

Gaganyaan 48 Sites

Gaganyaan – 48 Sites : గగన్‌యాన్‌ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి పంపేందుకు నలుగురు భారతీయ వ్యోమగాములు రెడీ అయ్యారు. వారికి ట్రైనింగ్  ఇప్పటికే పూర్తయింది. ఆ నలుగురు వ్యోమగాములు మూడు రోజుల పాటు అంతరిక్షంలో ఉండి.. ఆ తర్వాత సురక్షితంగా అరేబియా సముద్రంలోని భారత జల్లాల్లోకి ల్యాండ్ అవుతారు.

We’re now on WhatsApp. Click to Join

చిన్నపాటి తేడా వచ్చినా.. వందల కిలోమీటర్ల దూరంలో.. 

సముద్రంలో వ్యోమగాముల ల్యాండింగ్ ప్రాసెస్  చాలా క్లిష్టమైనది. ఈక్రమంలో చిన్నపాటి తేడా వచ్చినా పెద్ద రిస్కే ఉంటుంది. వ్యోమగాముల ల్యాండింగ్ జరగాల్సిన చోటులో కాకుండా.. వందల కిలోమీటర్ల దూరంలో జరిగే ముప్పు ఉంటుంది. అందుకే  వ్యోమగాముల సేఫ్ ల్యాండింగ్ కోసం అరేబియా సముద్రంలోని అంతర్జాతీయ జలాల్లో వివిధ దేశాల పరిధిలో 48 బ్యాకప్‌ సైట్లను(Gaganyaan – 48 Sites) ఇస్రో గుర్తించింది. నలుగురు వ్యోమగాములతో కూడిన మాడ్యూల్ ఆయా 48  ప్రదేశాల్లోనూ అంతరిక్షం నుంచి ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుందన్న మాట. వ్యోమగాములు సముద్రంలో ల్యాండ్ కాగానే రక్షించేందుకు  భారత నౌకాదళ సిబ్బంది అక్కడ కూడా  సిద్ధంగా ఉంటారని సమాచారం.

Also Read : T20 World Cup 2024: క్రికెట్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌.. ఫ్రీగా మ్యాచ్‌లు చూడొచ్చు.. ఎక్క‌డంటే..?

ఈ ఏడాది మానవ రహిత గగన్ యాన్ యాత్ర

అంతరిక్షంలోకి వెళ్లే భారత వ్యోమగాములను భూమిపైకి తిరిగి తీసుకొచ్చే క్రమంలో ప్రాణ నష్టం జరిగే రిస్క్‌ లేకుండా ఇస్రో ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగానే  ల్యాండింగ్‌కు అవకాశమున్న అదనపు పాయింట్లను కూడా రెడీ చేసి పెడుతోంది. ఈ ఏడాది కనీసం ఒక్క మానవ రహిత గగన్ యాన్ యాత్ర అయినా నిర్వహించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.  గగన్‌యాన్‌కు ఎంపికైన వ్యోమగాముల పేర్లను ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. భారత వాయుసేనకు చెందిన గ్రూప్‌ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్‌, అంగద్‌ ప్రతాప్‌, అజిత్ కృష్ణన్‌, వింగ్‌ కమాండర్‌ శుభాన్షు శుక్లా ప్రత్యేక స్పేస్ క్రాఫ్ట్  ద్వారా అంతరిక్షంలోకి వెళ్లనున్నారు. మన దేశం నుంచి స్వదేశీ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి వెళ్లనున్న మొదటి భారతీయ వ్యోమగాముల టీమ్ ఇదే అవుతుంది.

Also Read : DK Shivakumar: మనీలాండరింగ్‌ కేసులో సుప్రీంలో డీకేకి ఊరట