Just 5 Meters : 5 మీటర్ల దూరమే మిగిలింది.. రేపటిలోగా 41 మంది కార్మికుల రెస్క్యూ

Just 5 Meters : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు కొన్ని గంటల్లోనే బయటికి వచ్చే అవకాశం ఉంది.

Published By: HashtagU Telugu Desk
Just 5 Meters

Just 5 Meters

Just 5 Meters : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు రేపటిలోగా బయటికి వచ్చే అవకాశం ఉంది. సొరంగాన్ని అడ్డంగా డ్రిల్లింగ్ చేయడం దాదాపు పూర్తి కావచ్చింది. మొత్తం 60 మీటర్ల శిథిలాల్లో ఇప్పటివరకు దాదాపు 55 మీటర్ల మేర డ్రిల్లింగ్ కంప్లీట్ అయింది. నవంబరు 12న వీరంతా సొరంగంలో చిక్కుకున్నారు. కార్మికులు ఈ సొరంగంలో చిక్కుకొని నేటితో 17 రోజులు గడిచిపోయాయి.

We’re now on WhatsApp. Click to Join.

‘‘ర్యాట్-హోల్ మైనింగ్’’ అనేది మ్యానువల్‌గా మైనింగ్, డ్రిల్లింగ్ చేసే పద్ధతి. 24 మందితో కూడిన ర్యాట్ హోల్ మైనర్ల టీమ్ సోమవారం రోజు నుంచి మ్యానువల్ డ్రిల్లింగ్ చేయడం మొదలుపెట్టింది. గత 24 గంటల్లో 5 మీటర్ల మేర డ్రిల్ చేసింది. ఇంకో 5 మీటర్లు డ్రిల్ చేస్తే సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు బయటికి వచ్చేందుకు మార్గం సుగమం అవుతుంది.

Also Read: Woman – 40 Years Jail : రాక్షస తల్లికి 40 ఏళ్ల జైలు.. ఇద్దరు కూతుళ్లపై ఇద్దరు లవర్స్‌తో రేప్ !

అంతకుముందు సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కూలీలను చేరుకోవడం కోసం అమెరికాకు చెందిన ఆగర్‌ యంత్రంతో దాదాపు 47 మీటర్ల వరకు డ్రిల్లింగ్‌ చేశారు. భారత ఆర్మీ జవాన్లు దాదాపు 3 మీటర్ల మేర మ్యానువల్ డ్రిల్లింగ్ చేశారు. అనంతరం రంగంలోకి దిగిన ‘‘ర్యాట్-హోల్ మైనింగ్’’ టీమ్ ఇప్పటివరకు 5 మీటర్లు డ్రిల్ చేసింది. ఈ డ్రిల్లింగ్ పనులు పూర్తయిన తర్వాత 800 మి.మీ. వ్యాసం ఉన్న పైపులను మెల్లగా సొరంగంలో ప్రవేశపెట్టి.. వాటి ద్వారా కార్మికులను(Just 5 Meters) బయటికి లాగుతారు.

  Last Updated: 28 Nov 2023, 11:23 AM IST