41K Missing: గుజరాత్ లో 41 వేల మహిళల అదృశ్యం.. మోడీ మౌనం!

మోడీ సొంతం రాష్ట్రం కావడంతో దేశవ్యాప్తంగా గుజరాత్ ఎప్పుడూ చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. 

  • Written By:
  • Updated On - May 8, 2023 / 11:17 AM IST

మోడీ అంటే గుజరాత్ (Gujarat).. గుజరాత్ అంటే మోడీ. ప్రధాని మోడీ (PM Modi) సొంతం రాష్ట్రం కావడంతో దేశవ్యాప్తంగా గుజరాత్ ఎప్పుడూ చర్చనీయాంశమవుతూనే ఉంటుంది. అనేక ఏళ్ళుగా బీజేపీ ఏలుబడిలో ఉన్నరాష్ట్రమైన గుజరాత్ గురించి మోడీతో సహా బీజేపీ నేతలంతా పొగడ్తలతో ముంచెత్తుతారు. అక్కడ జరిగిన అభివృద్ది దేశంలో ఎక్కడా జరగలేదని ఊద‌రగొడతారు. అయితే ఆ రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలను గురించి మాత్రం నోరు మెదపరు. తెలియనట్టే నటిస్తారు. గుజరాత్ లో ఐదేళ్ళలో 41 వేల మంది మహిళలు (Missings) అదృశ్యమయ్యారు. మాయమైపోయారు. నిజం చెప్పాలంటే కిడ్నాప్ అయ్యారు. వాళ్ళ గురించి వెతుకులాటలేదు. వాళ్ళ ఆచూకీ తెలియదు. ఈ 41 వేల లెక్క ఎవరో బీజేపీ శత్రువులు చెప్పిన లెక్క కాదు. స్వయంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) చెప్తున్న గణాంకాలివి.  NCRB చెప్తున్న లెక్కల ప్రకారం 2016లో, 7105 మంది మహిళలు మాయమయ్యారు.

NCRB లెక్కలు ఇవే

2017లో 7712;

2018లో 9246;

2019లో 9268;

2020లో 8290 మంది మహిళలు మాయమయ్యారు.

5 ఏళ్ళలో గుజరాత్‌లోనే తప్పిపోయిన మొత్తం మహిళల (Womens) సంఖ్య‌ 41,621. ఇలా మాయమైన మహిళలు, ఎక్కువమందిని అక్రమ రవాణా చేసి అమ్మేస్తున్నారు. వీరితో వ్యభిచారం చేయిస్తున్నారు. వినకపోతే హత్యలుకుడా జరుగుతున్నాయి. మిస్సింగ్ కేసును హత్య కేసులా సీరియస్‌గా తీసుకోవడం లేదని మాజీ ఐపీఎస్ అధికారి, గుజరాత్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సభ్యుడు సుధీర్ సిన్హా అన్నారు. ప్రస్తుతం ఈ రిపోర్ట్ బయటికి రావడంతో గుజరాత్ లో ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలకు దిగాయి. సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.

Also Read: Fuel Price: సోమవారం పెట్రోల్, డీజిల్ ధరలు