India Vs Bangladesh : బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను బీజేపీ సీనియర్ నాయకుడు, పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఖండించారు. ఇప్పటికైనా బంగ్లాదేశ్‌లో మతపరమైన మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై హింసను ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం వైఖరి మారకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ‘‘బెంగాల్‌లోని హాసిమారా ఎయిర్ బేస్‌లో 40 రాఫెల్ యుద్ధ విమానాలు రెడీగా ఉన్నాయి. వాటిలో కేవలం రెండు రాఫెల్ యుద్ధ విమానాలను బంగ్లాదేశ్‌కు పంపితే సరిపోతుంది. పనంతా పూర్తయిపోతుంది’’ అని బంగ్లాదేశ్‌కు సువేందు అధికారి వార్నింగ్ ఇచ్చారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులను ఖండిస్తూ నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని బసిర్‌హట్‌లో(India Vs Bangladesh) బంగ్లాదేశ్ సరిహద్దు సమీపంలోని ఘోజదంగా వద్ద హిందూ సంస్థలతో కలిసి బీజేపీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సువేందు అధికారి పైవ్యాఖ్యలు చేశారు.
Also Read :Sora and Indians : ‘సోరా’పై భారతీయ ముద్ర.. భారత కళాకారులు, మూవీ డైరెక్టర్స్ ఫీడ్‌బ్యాక్
‘‘మా భారత దేశం బంగ్లాదేశ్‌పై ఆధారపడటం లేదు. బంగ్లాదేశ్ మా భారత్‌పై ఆధారపడి బతుకుతోంది. మేం 97 ఉత్పత్తులను పంపకపోతే.. మీకు బియ్యం, దుస్తులు లభించవు. జార్ఖండ్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తును మేం పంపకపోతే బంగ్లాదేశ్‌లోని 80 శాతం గ్రామాలకు వెలుతురు ఉండదు’’ అని సువేందు అధికారి పేర్కొనారు. హిందువులపై దాడులు, దేవాలయాల విధ్వంస ఘటనలను ఇక ఆపాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని ఆయన కోరారు. దీనిపై డిసెంబరు 16న మరో భారీ సభను బెంగాల్‌లో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బంగ్లాదేశ్‌లోని మహ్మద్ యూనుస్ ప్రభుత్వం అచ్చం తాలిబన్లను తలపించేలా ఉగ్రవాద భావజాలంతో పనిచేస్తోందని సువేందు అధికారి ఫైర్ అయ్యారు. ఇటీవలే బంగ్లాదేశ్‌కు వెళ్లిన భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ.. ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనుస్‌తో భేటీ అయ్యారు. విక్రమ్ మిస్రి భారత్‌కు తిరిగి వెళ్లిపోయిన వెంటనే బంగ్లాదేశ్ సంచలన ప్రకటన చేసింది. తమ దేశ వ్యవహారాల్లో ఇతర దేశాల జోక్యాన్ని సహించేది లేదని స్పష్టం చేసింది.