Greater Noida: గ్రేటర్ నోయిడాలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం

గ్రేటర్ నోయిడాలో (Greater Noida) ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఏడుగురు కార్మికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. కాగా ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు.

  • Written By:
  • Publish Date - February 9, 2023 / 11:33 AM IST

గ్రేటర్ నోయిడాలో (Greater Noida) ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఏడుగురు కార్మికులపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించారు. కాగా ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. సమాచారం ప్రకారం.. బాదల్‌పూర్ కొత్వాలి ప్రాంతంలోని జిటి రోడ్డులో ఉన్న హీరో మోటార్స్ కంపెనీ ముందు రోడ్డు దాటుతున్న కార్మికులను రోడ్‌వేస్ డిపో బస్సు ఢీకొట్టింది. ఇందులో నలుగురు కార్మికులు మరణించారు. కాగా ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఢిల్లీలోని ఆస్పత్రిలో చేర్పించారు.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలకు పంచనామా చేసి పోస్టుమార్టంకు తరలించారు. అందిన సమాచారం ప్రకారం.. బుధవారం రాత్రి 11.30 గంటలకు దాద్రీ వైపు నుంచి నోయిడా వైపు వెళ్తున్న నోయిడా డిపోకు చెందిన రోడ్‌వేస్ బస్సు రోడ్డు దాటుతున్న ఉద్యోగులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కార్మికులు సంకేశ్వర్ కుమార్ దాస్, మోహ్రీ కుమార్, సతీష్, గోపాల్, అనూజ్, ధరమ్‌వీర్, సందీప్‌లు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.

Also Read: Seven Workers Dead: కాకినాడ జిల్లాలో విషాదం.. ఏడుగురు కార్మికులు మృతి

బాదల్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న హీరో మోటార్స్ కంపెనీ కార్మికులు తమ నైట్ షిఫ్టులకు వెళ్తున్నారు. నోయిడా డిపో నుండి వచ్చిన బస్సు వారిని ఢీకొట్టింది. దీని కారణంగా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. తరువాత మరొకరు ఆసుపత్రిలో మరణించారు. పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడుతున్నాయని సెంట్రల్ నోయిడా ఏడీసీపీ విశాల్ పాండే తెలిపారు.