Site icon HashtagU Telugu

Car Plunges Into Pond: చెరువులోకి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి

Suicide

Deadbody Imresizer

కారు చెరువులోకి దూసుకెళ్లి (Car Plunges Into Pond) నలుగురు మృతిచెందిన విషాద ఘటన యూపీలోని హాపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. కపూర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామన గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హాపూర్ కి చెందిన రాహుల్, హరూన్, షోకీన్, అరుణ్ నిన్న రాత్రి ఘజియాబాద్ నుండి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న హోండా సిటీ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో నలుగురు మృతిచెందారు.

ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హాపూర్‌లోని కపూర్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామం సమాన కమ్రుద్దీన్ నగర్ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు బుధవారం అర్థరాత్రి ఓ కారు చెరువులో పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు. డైవర్ల సాయంతో పోలీసులు నలుగురి మృతదేహాలను, కారును బయటకు తీశారు. నలుగురు వ్యక్తులు ఘజియాబాద్ నుండి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Also Read: BJP Dilemma: కేసీఆర్ ‘ఖమ్మం’ సభ సక్సెస్.. బీజేపీకి దడ!

మృతులు సామాన గ్రామానికి చెందిన రాహుల్, హరున్, షోకీన్, బులంద్‌షహర్ జిల్లాకు చెందినవారు. ,మరొకరు కక్రానా గ్రామంలో నివసిస్తున్న అరుణ్‌గా గుర్తించారు. వీరంతా ఘజియాబాద్‌లోని వేదాంత ఫామ్‌హౌస్‌లో పార్కింగ్ కాంట్రాక్టర్లుగా పనిచేసేవారు. బుధవారం రాత్రి ఘజియాబాద్ నుంచి ఇంటికి వస్తున్నారు. కారు చెరువు సమీపంలోకి రాగానే అదుపు తప్పి చెరువులో పడిపోయింది. ఇందులో నలుగురు వ్యక్తులు మునిగిపోయారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, గ్రామస్తులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం అనంతరం కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.

Exit mobile version