Mumbai-Bangalore Highway: ముంబై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ముంబై-బెంగళూరు హైవే (Mumbai-Bangalore Highway)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.

  • Written By:
  • Publish Date - April 23, 2023 / 09:10 AM IST

ముంబై-బెంగళూరు హైవే (Mumbai-Bangalore Highway)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ముంబై వెళుతున్న ప్రైవేట్ ప్యాసింజర్ బస్సును వెనుక నుంచి ట్రక్కు ఢీకొట్టింది. ఈ సంఘటన అంబేగావ్ ప్రాంతంలోని స్వామి నారాయణ్ దేవాలయం సమీపంలో జరిగింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో గందరగోళ వాతావరణం ఏర్పడింది.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, పూణె-పీఎంఆర్‌డీఏ అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారందరినీ బస్సు నుంచి బయటకు తీసి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బస్సు సతారా నుంచి ముంబై వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన ట్రక్కు.. బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా.. 22 మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. ట్రక్కు బ్రేక్ ఫెయిలైనందునే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Also Read: Delta Airlines: విమానంలో సిబ్బంది పట్ల అసభ్య ప్రవర్తన.. బలవంతంగా ముద్దు పెట్టిన ప్రయాణికుడు..!

శనివారం అయోధ్యలో కూడా ఇలాంటి ఘటనే జరిగి 7 మంది మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య నుంచి అంబేద్కర్ నగర్ వెళ్తున్న బస్సు ట్రక్కును ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో 40 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, 7 మంది మరణించారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు బస్సు, లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా విచారం వ్యక్తం చేశారు.