Site icon HashtagU Telugu

Agniveer – New Rules : అగ్నివీరుల జాబ్స్ భర్తీ .. 4 కొత్త రూల్స్

Agniveers Secunderabad

Agniveer – New Rules : ఇండియన్ ఆర్మీ ‘అగ్నివీర్’​ రిక్రూట్​మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. అగ్నివీరులు కావాలనే ఆసక్తి కలిగిన అభ్యర్థులు మార్చి 22లోగా ఆన్​లైన్​లో https://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. భారత ప్రభుత్వం త్రివిధ దళాలైన ఇండియన్ ఆర్మీ, ఎయిర్​ఫోర్స్​, నేవీల్లోకి సమర్థులైన యువతీయువకులను తీసుకునేందుకు అగ్నిపథ్ పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. మహిళా ఆర్మీ పోలీస్, హవల్దార్​, సర్వేయర్​ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్, కానిస్టేబుల్ ఫార్మా, నర్సింగ్ అసిస్టెంట్, నర్సింగ్ అసిస్టెంట్ వెటర్నరీ పోస్టులకు ఎంపికయ్యే వారు సైన్యంలో తాత్కాలికంగా 4 ఏళ్లపాటు సర్వీస్ చేయాల్సి ఉంటుంది. ఈసారి మహిళా ఆర్మీ పోలీసు ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తుండటం విశేషం. అగ్నివీరుల(Agniveer – New Rules) ఎంపికకు ఈదఫా 4 కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

అడాప్టబిలిటీ టెస్ట్

అగ్నివీరులు దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో, ప్రతికూల వాతావరణాల్లో పనిచేయాల్సి ఉంటుంది. వాటిని అభ్యర్థులు తట్టుకోగలరో? లేదో? నిర్ధారణ చేయడానికి కొత్తగా అడాప్టబిలిటీ టెస్ట్​ నిర్వహిస్తున్నారు. మెడికల్ ఎగ్జామినేషన్​ కంటే ముందే ఈ టెస్ట్ ఉంటుంది. ఇందులో పాసయ్యే వారినే తరువాతి రౌండ్​కు పంపిస్తారు.

ఆఫీస్ అసిస్టెంట్​

అగ్నివీర్​ క్లర్క్ పోస్టు పేరును ఇప్పుడు ‘ఆఫీస్ అసిస్టెంట్’‌గా మార్చేశారు. ఈ పోస్టుల భర్తీ కోసం కొత్తగా టైపింగ్ టెస్టును కూడా అభ్యర్థులకు నిర్వహిస్తున్నారు. ప్రవేశ పరీక్ష, టైపింగ్ టెస్ట్​లలో అభ్యర్థుల వయస్సు, సామర్థ్యాలను బట్టి ఎంపిక చేస్తారు.

ఐరిస్ స్కాన్​

అసలు, నకిలీ అభ్యర్థుల మధ్య తేడాను గుర్తించడానికి పరీక్షకు ముందు ఐరిస్ స్కాన్ కూడా చేస్తారు. ఈ కొత్త బయోమెట్రిక్ వెరిఫికేషన్​ పద్ధతిని ఈదఫా రిక్రూట్​మెంట్ నుంచి అమల్లోకి తేనున్నారు.  రిక్రూట్​మెంట్ ర్యాలీలోనే అభ్యర్థుల ఆధార్ కార్డును వేరిఫై చేస్తారు. అభ్యర్థులు కచ్చితంగా తమ ఆధార్​ కార్డుతో  లింకైన ఫోన్ నంబర్లను మాత్రమే ఎన్​రోల్ చేసుకోవాలి. సైబర్​కేఫ్​ల ద్వారా ఎన్​రోల్​ చేసుకున్న అభ్యర్థులు తాము ఉపయోగించిన ఈ-మెయిల్​ అడ్రస్‌లనే వాడాలి.

పాలిటెక్నిక్

గతంలో ఐఐటీ చేసిన అభ్యర్థులు మాత్రమే టెక్నికల్ రిక్రూట్​మెంట్​కు అర్హులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు పాలిటెక్నిక్​ అభ్యర్థులకు సైతం ఆ అవకాశాన్ని కల్పించారు.

Also Read :Congress MP Candidates : 14 లోక్‌సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా ?