Site icon HashtagU Telugu

Earthquake: జమ్మూ కాశ్మీర్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

Chile Earthquake

Chile Earthquake

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌ (Jammu And Kashmir)లో ఆదివారం భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. ఉదయం 5.15 గంటలకు లోయలో భూకంపం సంభవించింది. తెల్లవారుజామున జమ్మూకశ్మీర్‌లో భూకంపం సంభవించింది. తమ తమ ఇళ్లలో నిద్రిస్తున్న వారంతా భయపడి ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ఆదివారం ఉదయం 5.15 గంటలకు భూకంపం సంభవించింది. తెల్లవారుజామున భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. అందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవు. ప్రకంపనల కారణంగా కాశ్మీర్‌లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు.

అంతకుముందు ఏప్రిల్ 28న నేపాల్‌లో అర్థరాత్రి రెండుసార్లు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.8, 5.9గా నమోదైంది. ఈ భూకంప కేంద్రం నేపాల్‌లోని బజురా జిల్లా దహకోట్‌లో ఉంది. నేపాల్ స్థానిక కాలమానం ప్రకారం.. మొదటి భూకంపం సుమారు 12 గంటలకు వచ్చింది. రెండవది తెల్లవారుజామున 1.30 గంటలకు వచ్చింది.

Also Read: Operation Kaveri: సూడాన్ నుంచి ఢిల్లీ చేరుకున్న మరో 350 మంది భారతీయులు.. ఇప్పటివరకు ఎంతమంది వచ్చారంటే..?

ఇక అంతర్జాతీయంగా చూసుకుంటే.. ఏప్రిల్ 25 ఉదయం ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో బలమైన భూకంపం వచ్చింది. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ ప్రకారం.. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 7.3గా నమోదైంది. ఈ భూకంపంతో పాటు సుమారు రెండు గంటల పాటు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. న్యూజిలాండ్‌లో సోమవారం ఉదయం భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.2గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.