Site icon HashtagU Telugu

38 Tested Covid: కరోనా కలకలం.. యూపీలో 38 విద్యార్థినులకు కోవిడ్ పాజిటివ్

children corona covid

children corona covid

దేశవ్యాప్తంగా కరోనా (Corona) మహమ్మారి తరుముకొస్తోంది. రికార్డుస్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలోని మితౌలీ బ్లాక్‌లోని కస్తూర్బా రెసిడెన్షియల్ పాఠశాలలో 38 మంది బాలికలు కరోనా వచ్చింది. వైద్య పరీక్షల్లో కోవిడ్ -19 అని తేలినట్టు జిల్లా ఆరోగ్య అధికారులు గుర్తించారు. లఖింపూర్ ఖేరీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO), సంతోష్ గుప్తా మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల్లో ఒకరికి కూడా కోవిడ్ సోకినట్ట తెలిపారు. ఆ తర్వాత మొత్తం క్యాంపస్‌లో కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ ఏడాది ఒక రోజులో జిల్లాలో నమోదైన అత్యధిక కోవిడ్ కేసులు కూడా ఇవే.

అయితే పాఠశాలలోని మొత్తం 92 కాంటాక్ట్ కేసుల (Corona) నమూనాలను పరీక్ష కోసం పంపినట్లు తెలిపారు. వారిలో 38 మంది రిపోర్టు పాజిటివ్‌గా ఉంది. కోవిడ్-పాజిటివ్‌గా గుర్తించిన వారిని పాఠశాల క్యాంపస్‌లో ప్రత్యేక విభాగంలో ఉంచినట్లు ఆయన తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్, లఖింపూర్ ఖేరీ, మహేంద్ర బహదూర్ సింగ్ మాట్లాడుతూ, మెడికల్ కిట్ అందించడం, శానిటైజేషన్ మొదలైనవాటితో సహా అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నామని, భయపడాల్సిన అవసరం లేదని, కోవిడ్-19 ప్రోటోకాల్‌ను కచ్చితంగా పాటించాలని ప్రజలను కోరారు.

Also Read: Ram Charan Game Changer: రామ్ చరణ్-శంకర్ మూవీ టైటిల్ ఇదే!

Exit mobile version