36 Died : 36 మంది మృతి.. లోయలో పడిపోయిన బస్సు

36 Died : జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Published By: HashtagU Telugu Desk
10 Died

10 Died

36 Died : జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దాదాపు 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు అతివేగంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 36 మంది ప్రయాణికులు అక్కడికక్కడే చనిపోయారు.మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దోడా పట్టణానికి సమీపంలోని  బటోట్-కిష్త్వార్ జాతీయ రహదారిపై ట్రుంగల్-అస్సార్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

డ్రైవర్ అకస్మాత్తుగా బస్సుపై కంట్రోల్ కోల్పోవడంతో.. అది రోడ్డుపై నుంచి ఏకంగా 300 అడుగుల లోతున్న లోయలోకి దూసుకెళ్లి పడిపోయిందని జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ తెలిపారు. క్షతగాత్రులను కిష్త్వార్, దోడా ప్రభుత్వ ఆస్పత్రులలో చేర్పించామని వెల్లడించారు. బస్సులో నుంచి మృతదేహాలను వెలికితీసినట్లు పేర్కొన్నారు.  క్షతగాత్రులను దోడా, కిష్త్వార్‌లలోని స్థానిక ఆస్పత్రుల నుంచి శ్రీనగర్‌లోని ప్రధాన ఆస్పత్రులకు తరలించేందుకు హెలికాప్టర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ప్రకటించారు. గాయపడిన వారి ప్రాణాలను రక్షించేందుకు ఏ సాయమైనా చేసేందుకు సిద్ధమని వెల్లడించారు.

Also Read: India Opt To Bat: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టు ఇదే..!

  Last Updated: 15 Nov 2023, 02:18 PM IST