Site icon HashtagU Telugu

Coal India Jobs 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్, కోల్ ఇండియాలో 330 ఉద్యోగాలు, పది పాసైతే చాలు

Coal India Jobs 2023

Coal India Jobs 2023

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.భారత ప్రభుత్వ బొగ్గు గనుల (Coal India Jobs 2023) మంత్రిత్వశాఖకు చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ కుచెందిన కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో 330 పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇందులో మైనింగ్ సర్దార్, ఎలక్ట్రీషియన్, టెక్నిషియన్, డిప్యూటీ సర్వేయర్, అసిస్టెంట్ ఫోర్ మెన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టును బట్టి టెన్త్ ఉత్తీర్ణతతోపాటు, మైనింగ్ సర్దార్ సర్టిఫికేట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్, ఐటీఐ సర్టిఫికెట్ మైన్స్‌ సర్వే సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ/ఓవర్‌మ్యాన్స్‌ సర్టిఫికెట్‌ ఆఫ్‌ కాంపిటెన్సీ/గ్యాస్‌ టెస్టింగ్‌ సర్టిఫికెట్/ఫస్ట్‌ ఎయిడ్‌ సర్టిఫికెట్‌/ఎలక్ట్రికల్‌ సర్టిఫికేట్ తోపాటుగా ఇంజనీరింగ్ లో మూడేళ్లు డిప్లామా చేసి ఉండాలి. వయస్సు ఏప్రిల్ 19వ తేదీ నుంచి 18 ఏళ్ల నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి.

పై పోస్టులకు ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో ఏప్రిల్ 19, 2023వ తేదీ లోపు దరఖాస్తు సమర్పించవచ్చు. దరఖాస్తు సమయంలో రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రాతపరీక్ష, రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలక్ట్ చేస్తారు. రాత పరీక్ష మే 5న నిర్వహించనున్నారు. మే 29న తుది ఫలితాలు ప్రకటిస్తారు. ఇక జీత భత్యాల గురించి అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు ఇవే.
మైనింగ్‌ సర్దార్‌ పోస్టులు: 77
ఎలక్ట్రీషియన్‌ (నాన్‌ ఎగ్జిక్యూటివ్‌) టెక్నీషియన్‌ పోస్టులు: 126
డిప్యూటీ సర్వేయర్‌ పోస్టులు: 20
అసిస్టెంట్‌ ఫోర్‌మేన్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులు: 107