324 Jobs : 324 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL Jobs) నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో అత్యధికంగా 138 ఫిట్టర్ పోస్టులు ఉన్నాయి. 50 కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్టులు, 27 ఎలక్ట్రీషియన్ పోస్టులు, 20 టర్నర్ పోస్టులు, 17 మెషినిస్ట్ పోస్టులు, 10 టూల్ అండ్ డై మేకర్ పోస్టులు, 10 వెల్డర్ పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు మోటార్ వెహికల్ మెకానిక్ పోస్టులు 6, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ పోస్టులు 8, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మెకానిక్ పోస్టులు 6, పెయింటర్ పోస్టులు 7, కార్పెంటర్ పోస్టులు 6, షీట్ మెటల్ వర్కర్ పోస్టులు 4, స్టెనోగ్రాఫర్ పోస్టులు 3 ఉన్నాయి.
We’re now on WhatsApp. Click to Join
సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ(324 Jobs) పాసైన వారు పైన మనం చెప్పుకున్న జాబ్స్‌కు అప్లై చేయొచ్చు. జనరల్ కేటగిరి అభ్యర్థుల వయసు 27 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ అభ్యర్థులు 30 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 32 ఏళ్ల వయోపరిమితి వరకు అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఆగస్టు 31. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌ను వచ్చే ఏడాది సెప్టెంబర్ రెండో, మూడో వారంలో నిర్వహిస్తారు.
Also Read :28 Islands – India : దారికొచ్చిన మాల్దీవ్స్.. భారత్‌కు 28 దీవులు అప్పగింత.. ఎలా ?
ఎంపికైన అభ్యర్థుల లిస్టును సెప్టెంబర్ నాలుగో వారంలో రిలీజ్ చేస్తారు. అభ్యర్థులు ఉద్యోగంలో 2024 అక్టోబర్ రెండో వారంలో చేరాల్సి ఉంటుంది. పదోతరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. అప్లై చేయడానికి ఎలాంటి ఫీజు కూడా లేదు. అప్రెంటిస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మొదటి సంవత్సరంలో ప్రతినెలా రూ.7700; రెండో సంవత్సరంలో ప్రతినెలా రూ.8,050 చొప్పున స్టైపెండ్‌ను చెల్లిస్తారు.
Also Read :Adani Rebound : అదానీ గ్రూప్ స్టాక్స్ రీబౌండ్.. మళ్లీ లాభాల పంట
ఐటీబీపీలో జాబ్స్
ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) 200 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన వారు సెప్టెంబర్ 10వ తేదీలోగా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి. ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.