Site icon HashtagU Telugu

Mumbai : ముంబై ఎయిర్ పోర్టులో 32కోట్ల విలువైన బంగారం పట్టివేత..!!

Gold

Gold

ముంబై ఎయిర్ పోర్టులో 32కోట్ల విలువైన బంగారాన్ని సీజ్ చేశారు కస్టమ్స్ అధికారులు. 61కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 32కోట్లు. ఈ కేసులో 7గురుని అరెస్టు చేశారు. అందులో ఇద్దరు మహిళలు ఉన్నారు. ముంబై కస్టమ్స్ డిపార్ట్ మెంట్ చరిత్రలోనే ఎయిర్ పోర్టులో ఒక రోజులో సీజ్ చేసిన అతిపెద్దది ఇదే కావడం గమనార్హం.

కస్టమ్స్ డిపార్ట్ మెంట్ తెలిపిన వివరాల ప్రకారం…నలుగురు భారతీయులు టాంజనియా నుంచి వచ్చారు. ప్రత్యేకంగా రూపొందించిన నడుము బెల్ట్ పాకెట్స్ లో బంగారాన్ని దాచారు. నలుగురి నుంచి రూ. 28.17కోట్ల విలువైన 53కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ప్రత్యేకంగా రూపొందించిన బెల్ట్ లలో బంగారు కడ్డీలను దాచారు. వీరికి దోహా ఎయిర్ పోర్టులో సూడాన్ పౌరుడు బెల్ట్ లను అందించినట్లుగా తెలిపారు. వీరిని 14రోజుల పాటు జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.