31 Killed: శాంతించని మణిపూర్.. మొత్తం 31 మంది మృతి!

మణిపూర్ హింసాయుత సంఘటనల్లో ఇప్పటి వరకు 31 మందిమరణించినట్టు (Killed) స్థానిక మీడియా ఉఖ్రుల్ టైమ్స్ పేర్కొంది.

Published By: HashtagU Telugu Desk
Manipur Violence

Manipur Violence

మణిపూర్ (Manipur) లో గత రెండు రోజులుగా తీవ్ర హింస చేలరేగుతున్న విషయం తెలిసిందే. వివిధ ప్రాంతాలలో మే 3 రాత్రి నుండి కుకి తెగ ఆదివాసులు గిరిజనేతర మైతేయి కమ్యూనిటీ ల మధ్య జరుగుతున్న కాల్పులు, దాడులు..తదితర హింసాయుత సంఘటనల్లో ఇప్పటి వర్కు 31 మందిమరణించినట్టు (Killed) స్థానిక మీడియా ఉఖ్రుల్ టైమ్స్ పేర్కొంది. కాల్పులు, సామూహిక హింస కారణంగా మరణించిన వారి సంఖ్యపై మణిపూర్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ప్రత్యక్ష సాక్షులు, బాధిత కుటుంబ సభ్యులకథనాలు, ఆసుపత్రి మార్చురీ రికార్డులు ఆధారంగా ఉఖ్రుల్ టైమ్స్ పత్రిక మరణాల సంఖ్యను పేర్కొంది. అయితే మరణాలు (Deaths) ఇంకా ఎక్కువగా ఉండొచ్చని ఆ పత్రిక తెలిపింది.

ఇంఫాల్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (జెఎన్‌ఐఎంఎస్)కి తరలించిన మృతదేహాల (Dead bodies) సంఖ్య 13గా ఉందని , ఇంఫాల్ లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్) మార్చురీ లో ఉన్న డెడ్ బాడీల లెక్క ప్రకారం మరో 18 మంది మరణించారు. కాగా, ఇంఫాల్‌కి చెందిన సాంగై ఎక్స్‌ప్రెస్ అనే పత్రిక (Media) మరో 11మంది చనిపోయారని తెలిపింది. “అయితే, ఈ నివేదికను దాఖలు చేసే సమయంలో మృతదేహాలను ఇంకా గుర్తించ లేదు. మణిపూర్‌లోని ఇతర ప్రాంతాలలో కుకీ గిరిజనులు, మైతేయి/మీటీ కమ్యూనిటీల మధ్య జరిగిన జాతి హింస కారణంగా సంభవించిన మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.”అని ఉఖ్రుల్ టైమ్స్ నివేదిక పేర్కొంది.

Also Read: CSK vs MI: ఐపీఎల్ లో నేడు అసలు సిసలైన మ్యాచ్.. ముంబై వర్సెస్ చెన్నై పోరు..!

  Last Updated: 06 May 2023, 11:12 AM IST