Corona Cases: కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజే 3,016 పాజిటివ్ కేసులు

  • Written By:
  • Publish Date - March 30, 2023 / 03:45 PM IST

వెయ్యి.. రెండు వేలు.. మూడు వేలు.. ఇలా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయే తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇండియాలో 24 గంటల్లో కొత్త కేసులు 3,016 నమోదయ్యాయి. (ఇవి బుధవారం రోజంతా నమోదైన కేసులు). మంగళవారంతో పోల్చితే.. నిన్న కేసులు 40 శాతం ఎక్కువగా వచ్చాయి. ఇంకా చెప్పాలంటే.. 6 నెలల్లో ఇవే అత్యధిక కేసులు. ఇప్పుడు డైలీ పాజిటివిటీ రేటు 2.7 శాతం అవ్వగా… వారపు పాజిటివిటీ రేటు 1.71 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియాలో 2022 అక్టోబర్ 2న 3,375 కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఆ స్థాయిలో ఇప్పుడు నమోదయ్యాయి.

నిన్న ఒక్కరోజే కరోనాతో 14 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 5,30,862కి చేరింది. నిన్న మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్ ప్రదేశ్‌లో ఒకరు చనిపోగా… కేరళలో ఏకంగా 8 మంది చనిపోయారు. ఇప్పుడు కరోనా మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. ఇప్పుడు మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.03 శాతంగా ఉంది. జాతీయ రికవరీ రేటు 98.78 శాతంగా ఉంది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,41,68,321కి చేరింది.