Site icon HashtagU Telugu

301 Jobs : ఎనిమిదో తరగతి పాసైన వారికి గవర్నమెంట్ జాబ్స్

301 Jobs

301 Jobs

301 Jobs : ఎనిమిది, పదో తరగతి పాసైన వారికి ఉద్యోగ అవకాశం. ముంబైలోని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్(నేవీ), నావల్ డాక్‌యార్డ్ అప్రెంటిస్ స్కూల్ వివిధ ట్రేడుల్లో 301 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.  ఆయా విభాగాల్లో అప్రెంటిస్ అవకాశాన్ని దక్కించుకోవాలంటే..  సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసై ఉండాలి. అర్హతలున్నవారు మే 10 వరకు అప్లై చేయొచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా జాబ్‌కు ఎంపిక చేస్తారు. అభ్యర్థుల  వయసు కనీసం 14 సంవత్సరాలకు పైబడి ఉండాలి. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేయాలి. అప్లై చేయడానికి చివరి తేదీ మే 10.

We’re now on WhatsApp. Click to Join

288 పోస్టులలో.. 

288 పోస్టులకు ఎంపికయ్యే వారికి ఏడాది పాటు అప్రెంటిస్‌షిప్ ఉంటుంది.  ఈవిభాగంలో ఫిట్టర్- 50 పోస్టులు, ఎలక్ట్రీషియన్- 40 పోస్టులు,  మెకానిక్(డీజిల్)- 35 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్- 26 పోస్టులు,  వెల్డర్(జి అండ్‌ ఇ)- 20 పోస్టులు,  షిప్ రైట్(స్టీల్)(ఫిట్టర్)- 16 పోస్టులు,  షిప్ రైట్(ఉడ్)కార్పెంటర్- 18 పోస్టులు, మెషినిస్ట్, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్,  పైప్ ఫిట్టర్ చెరో 13 పోస్టులు, పెయింటర్(జి)- 09 పోస్టులు,  మేసన్(బీసీ)- 08 పోస్టులు, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్- 07 పోస్టులు,  మెకానిక్ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఏసీ- 07 పోస్టులు,  షీట్ మెటల్ వర్కర్- 03 పోస్టులు, టైలర్(జి)సీవింగ్ టెక్నాలజీ/డ్రెస్ మేకింగ్- 03 పోస్టులు,  ఐ అండ్‌ సీటీఎస్‌ఎం- 03 పోస్టులు, ప్యాటర్న్ మేకర్/కార్పెంటర్- 02 పోస్టులు,  ఎలక్ట్రోప్లేటర్- 01 పోస్టు, ఫౌండ్రీ మ్యాన్- 01 పోస్టు ఉన్నాయి.

Also Read : 5G Network Issue : 5జీ ఫోన్‌లో నెట్‌వర్క్ ఇష్యూ ఉందా ? పరిష్కారాలు ఇవిగో

రెండేళ్ల అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్

మొత్తం 13 పోస్టులకు ఎంపికయ్యే వారికి రెండేళ్ల అప్రెంటిస్ ‌షిప్ ట్రైనింగ్ ఇస్తారు. వీటిలో  రిగ్గర్- 12 పోస్టులు, ఫోర్జర్ అండ్‌ హీట్ ట్రీటర్- 01 పోస్టు ఉన్నాయి.

Also Read :YS Sharmila : వైఎస్సార్ సీపీ ఆయువుపట్టుపై వైఎస్ షర్మిల ఫోకస్!