Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరంలో పూజారి పోస్టులకు 3వేల అప్లికేషన్లు

Ayodhya Ram Mandir : అయోధ్యలోని నవ్య భవ్య రామ మందిరంలో జనవరి 22న శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది.

Published By: HashtagU Telugu Desk
Ayodhya Ram Mandir Updates work completing soon

Ayodhya Ram Mandir Updates work completing soon

Ayodhya Ram Mandir : అయోధ్యలోని నవ్య భవ్య రామ మందిరంలో జనవరి 22న శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఈనేపథ్యంలో ఆలయంలో పూజారి పోస్టులను భర్తీ చేసే ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. దీనికి దాదాపు 3వేల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 200 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. అయోధ్యలోని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ప్రధాన కార్యాలయమైన కరసేవక్ పురంలో అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఈవిషయాన్ని అయోధ్య రామమందిర్ ట్రస్ట్ కోశాధికారి గోవింద్ దేవ్‌గిరి వెల్లడించారు. బృందావన్‌కు చెందిన జైకాంత్ మిశ్రా, అయోధ్యకు చెందిన ఇద్దరు మహంతులు మిథిలేష్ నందిని శరణ్, సత్యన్నారాయణ దాస్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ పూజారి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేస్తోందన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

200 మంది అభ్యర్థుల్లో 20 మందిని పూజారి పోస్టులకు ఎంపిక చేస్తామని గోవింద్ దేవ్‌గిరి చెప్పారు. ఎంపికైన అభ్యర్థులకు ఆరు నెలల శిక్షణ ఉంటుందని.. ఆ తర్వాత అర్చకులుగా నియమించి, వివిధ పోస్టులను కేటాయిస్తామని తెలిపారు. ఎంపిక కాని వారు కూడా శిక్షణలో పాల్గొనొచ్చని, వారికి కూడా సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. భవిష్యత్తులో పూజారి పోస్టుల ఖాళీలు ఏర్పడితే.. సర్టిఫికెట్లు పొందే  అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తామని ఆయన చెప్పారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు ఉచిత ఆహారం, వసతి, రూ. 2,000 భత్యం ఇస్తామని(Ayodhya Ram Mandir)  పేర్కొన్నారు.

Also Read: Yama Temple : ఇదిగో యముడి ఆలయం.. ప్రసన్నం చేసుకునే పూజలివీ

  Last Updated: 21 Nov 2023, 02:37 PM IST