UIIC – 300 Jobs : డిగ్రీ చేసిన వారికి గవర్నమెంట్ జాబ్ పొందే ఛాన్స్ ఇది. చెన్నైలోని ప్రభుత్వ రంగ బీమా సంస్థ ‘యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్’ కంపెనీ 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 8 పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లో, 3 పోస్టులు తెలంగాణలో ఉన్నాయి. మిగతా పోస్టులు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని యూఐఐసీ కార్యాలయాల్లో ఉన్నాయి. ఈ పోస్టులలో అత్యధికంగా 159 అన్ రిజర్వ్‌డ్ కేటగిరిలో ఉన్నాయి. ఓబీసీలకు 55 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 30 పోస్టులు, ఎస్సీలకు 30 పోస్టులు, ఎస్టీలకు 26 పోస్టులను రిజర్వ్ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.1000తో పాటు జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, కంపెనీ ఉద్యోగులు అప్లికేషన్ ఫీజుగా రూ.250తో పాటు జీఎస్టీ పే చేయాలి. ఈ జాబ్స్‌కు అప్లై చేసే అభ్యర్థుల వయస్సు 2023 సెప్టెంబర్ 30 నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి.
Also Read: AI Putin Vs Putin : ఏఐ పుతిన్‌తో రియల్ పుతిన్ చిట్‌చాట్.. ఏం మాట్లాడుకున్నారంటే..
ఈ జాబ్స్‌కు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డిసెంబరు 16న ప్రారంభమై జనవరి 6న ముగుస్తుంది. అభ్యర్థులు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేయొచ్చు. అభ్యర్థులకు ఆన్లైన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పాసైతే రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ చేస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పే స్కేల్ నెలకు రూ.22,405 నుంచి రూ.62,265 వరకు(UIIC – 300 Jobs) ఉంటుంది.