Site icon HashtagU Telugu

Encounter: ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారత భద్రతా బలగాలు..!!!

Encounter

Encounter

జమ్ము కశ్మీర్ లోని కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు లష్కరులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. జిల్లాలోని జుమాగండ్ గ్రామంలోకి ముగ్గురు ముష్కరులు చొరబడ్డారన్న సమాచారంతో స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో గాలింపు బ్రుందంపై ఉగ్రవాదులు కాల్పులకు దిగారు. దీంతో అప్రమత్తమైన భద్రత బలగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు.

అయితే ఎన్ కౌంటర్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులు పాకిస్తాన్ కు చెందిన లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు చెందినవారిగా గుర్తించామని కశ్మీర్ ఐజీ తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, యుద్ధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అయితే మంగళవారం, బుధవారాల్లో వరుసగా రెండుసార్లు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడటంతో భద్రత దళాలు మరింత అప్రమత్తయ్యాయి.