Bus Falls Into Gorge : ఉత్తరాఖండ్‌లోని నైనితాల్ జిల్లా భీమ్‌తల్ పట్టణం సమీపంలో ఉన్న లోయలో బస్సు పడిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు చనిపోగా, 24 మందికిపైగా గాయాలపాలయ్యారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం చోటుచేసుకున్న లోయ.. భీమ్‌తల్ – రాణీబాఘ్ మోటార్ రోడ్‌లోని ఆమ్ డాలీ ప్రాంతంలో ఉంది. అక్కడికి హుటాహుటిన 15 అంబులెన్సులను తరలించారు. గాయపడిన వారిని భీమ్‌తల్, హల్ద్వానీలలోని ఆస్పత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్స్, అగ్నిమాపక విభాగం అధికారులు సంయుక్తంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. లోయలో పడిన బస్సులో ప్రాణాలతో మిగిలిన వారిని తాళ్ల సాయంతో(Bus Falls Into Gorge) పైకి లాగేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని కాపాడారు. ప్రమాదం జరిగిన టైంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
भीमताल के निकट बस के दुर्घटनाग्रस्त होने का समाचार अत्यंत दुःखद है। स्थानीय प्रशासन को त्वरित राहत एवं बचाव कार्य के लिए निर्देशित किया है।
बाबा केदार से सभी यात्रियों के सकुशल होने की कामना करता हूं।
— Pushkar Singh Dhami (@pushkardhami) December 25, 2024
Also Read :Childhoods Chained : కాళ్ల కడియాలు కాదు.. ఆడపిల్లల జీవితాలకు సంకెళ్లు.. ఆ ఊరిలో పుట్టకముందే నిశ్చితార్ధాలు
అల్మోరా నుంచి హల్ద్వానీ వైపునకు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు దాదాపు 1500 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడినట్లు తెలిసింది. లోయలోకి బస్సు పడే క్రమంలో.. కొంతమంది ప్రయాణికులు బస్సులో నుంచి పడిపోయినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామి విచారణ వ్యక్తం చేశారు. స్థానిక అధికార యంత్రాంగం అత్యవసర సహాయక చర్యలు చేపట్టిందని వెల్లడించారు. రెస్క్యూ వర్క్స్‌ను మరింత వేగవంతం చేయాలని సూచించారు.
Also Read :Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం.. 72 మంది ప్యాసింజర్స్ ప్రమాణం
మంగళవారం రాత్రి ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్ నుంచి డెహ్రాడూన్ వైపునకు వెళ్తున్న స్కూలు బస్సుకు రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ అకస్మాత్తుగా బస్సుపై అదుపు కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనలో 16 ఏళ్ల స్కూలు విద్యార్థినికి గాయాలయ్యాయి. ఇంకొందరు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. మొత్తం మీద వరుస రోడ్డు ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. ప్రజల ప్రాణాలను సంకటంలోకి నెట్టేస్తున్నాయి. రోడ్ల నిర్మాణాలు సరిగ్గా ఉంటే చాలావరకు రోడ్డు ప్రమాదాలను ఆపొచ్చు. వాహనదారులు జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తే చాలావరకు ప్రమాదాలు తగ్గుతాయి.