గురుగ్రామ్ లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డుమీద ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మరణించగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ట్రక్కును డ్రైవర్ రోడ్డు మధ్యలో పార్క్ చేశాడని, ఇండికేషన్ లైట్లనూ వేయలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, పరారీలో ఉన్న ట్రక్ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
బిలాస్‌పూర్ చౌక్ సమీపంలో NH-48లో ఆగి ఉన్న ట్రక్కును మారుతీ సుజుకీ బాలెనో కారు ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు గురుగ్రామ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. బుధవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో రేవారి నుంచి పటౌడీకి వెళ్తున్న ఐదుగురు స్నేహితులు ప్రయాణిస్తున్న కారు.. రోడ్డు మధ్యలో ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Also Read: Writer Bhagawan: రాముడు తన భార్య సీతతో కలిసి వైన్ తాగేవాడు.. కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ స్పాట్ లోనే మృతి చెందగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. గాయపడిన ఇద్దరు ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. అయితే వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. లైట్లు, రిఫ్లెక్టర్లు లేకుండా ఆగి ఉన్న ట్రక్కును కారు ఢీకొన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తదుపరి విచారణ జరుగుతోంది. పరారీలో ఉన్న ట్రక్ డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.