Encounter : ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

పోలీసుల ప్రతికాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు(Encounter) హతమయ్యారు. 

Published By: HashtagU Telugu Desk
Khalistani Terrorists Encounter Up Encounter

Encounter : ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు.  ఇవాళ తెల్లవారుజామున పిలిభిత్ జిల్లాలోని పురానాపుర్‌ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ అనే నిషేధిత తీవ్రవాద సంస్థలో  గుర్విందర్ సింగ్ (25), వీరేందర్ సింగ్ అలియాస్ రవి (23), జస్‌ప్రీత్ సింగ్ అలియాస్ ప్రతాప్ సింగ్ (18) సభ్యులుగా ఉండేవారు. ఈ ముగ్గురు ఖలిస్తానీ ఉగ్రవాదులు కలిసి డిసెంబరు 21న (శనివారం) పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లా కలనౌర్ సబ్ డివిజన్‌లోని ఒక పోలీసు చెక్ పోస్ట్‌పై దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

Also Read :Bank Loans Evasion : బ్యాంకులకు వందల కోట్లు ఎగ్గొట్టిన తెలుగు రాష్ట్రాల కంపెనీలివే

ఈ ముగ్గురు యూపీలోని పురానాపుర్‌ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు పంజాబ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారిని పట్టుకునేందుకు  పంజాబ్ పోలీసులు, యూపీ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. ఈక్రమంలో ఖలిస్తానీ ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు, ప్రతి కాల్పులు జరిగాయి. పోలీసుల ప్రతికాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు(Encounter) హతమయ్యారు.  వారి నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, రెండు గ్లోక్ పిస్టల్స్, అనేక లైవ్ రౌండ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read :CV Anand : నేషనల్ మీడియాను కొనేశారంటూ వ్యాఖ్యలు.. క్షమాపణ కోరిన హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్

ఈ ఎన్‌కౌంటర్ విషయంలో ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘దేశ భద్రత విషయంలో అస్సలు రాజీపడం. మేం ఎన్‌కౌంటర్ చేసిన ముగ్గురు ఉగ్రవాదులు ఖలిస్తాన్ జిందాబాద్ ఫోర్స్ (కేజెడ్ఎఫ్)కు చెందినవారు. ఈ ఉగ్రసంస్థకు పాకిస్తాన్ నిధులను అందిస్తోంది’’ అని ఆయన వెల్లడించారు. ‘‘ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని యూపీ రాష్ట్ర ప్రభుత్వం సహించదు. ఉపేక్షించదు. మన దేశంలో ఉగ్రవాదానికి చోటు ఇవ్వబోం’’ అని డీజీపీ వెల్లడించారు. ఇప్పటివరకు మనం మావోయిస్టుల ఎన్‌కౌంటర్ వార్తలనే విన్నాం. ఇక ఖలిస్తానీ ఉగ్రమూకల ఎన్‌కౌంటర్లు మొదలయ్యాయి. ఈ పరిణామాలు ఎక్కడిదాకా వెళ్తాయో వేచిచూడాలి.

Also Read :Tech Lookback 2024 : ఈ ఏడాదిలో వాట్సాప్ ప‌రిచ‌యం చేసిన ఫీచ‌ర్స్..!

  Last Updated: 23 Dec 2024, 01:43 PM IST