Indian Warships : భారత్ అలర్ట్ అయింది. అరేబియా సముద్రంలో మూడు యుద్ధనౌకలను మోహరించింది. యుద్ధనౌకలు INS మొర్ముగో, INS కొచ్చి, INS కోల్‌కతాను రంగంలోకి దింపింది. ఇటీవల గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరానికి సమీపంలోని అరేబియా సముద్రంలో ఇజ్రాయెలీ నౌకపై డ్రోన్ దాడి జరిగింది. ఈనేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా భారత్‌కు వచ్చే నౌకలకు రక్షణ కల్పించేందుకుగానూ యుద్ధనౌకలను(Indian Warships) మోహరించింది. దీంతోపాటు అరేబియా సముద్రంలో గస్తీ కోసం P-8I గస్తీ విమానాలను భారత నౌకాదళం వినియోగిస్తోంది. గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్‌లను కూడా వాడుతోంది. వెస్ట్రన్ నావల్ కమాండ్‌కు చెందిన మారిటైమ్ ఆపరేషన్స్ సెంటర్ కోస్ట్ గార్డ్ ఇతర అన్ని సంబంధిత ఏజెన్సీలతో కలిసి పనిచేస్తోంది.
We’re now on WhatsApp. Click to Join.
- ఇటీవల గుజరాత్ తీరంలో ఇజ్రాయెలీ నౌక MV కెమ్ ప్లూటోపై దాడి చేసింది ఇరానే అని అమెరికా ఆరోపించింది.
- అయితే ఈ దాడి చేసింది తాము కాదని ఇరాన్ స్పష్టం చేస్తోంది.
- దీంతో యెమన్ హౌతీలే ఆ డ్రోన్‌ను ప్రయోగించి ఉంటారని భావిస్తున్నారు.
- ఇండియాలోని అరేబియా సముద్ర తీరం నుంచి యెమన్ సముద్ర తీరానికి మధ్య దాదాపు 1750 కిలోమీటర్ల దూరం ఉంది.
- ఇండియాలోని అరేబియా సముద్ర తీరం నుంచి ఇరాన్ సముద్ర తీరానికి మధ్య దాదాపు 2400 కిలోమీటర్ల దూరం ఉంది.
- ఇండియాలోని అరేబియా సముద్ర తీరం నుంచి పాకిస్తాన్ సముద్ర తీరానికి 2000 కిలోమీటర్ల దూరం ఉంది.
- ఈ లెక్కన చూసుకుంటే భారత్, యెమన్ మధ్య రేంజ్ తక్కువగా ఉంది. ఈ లెక్కన హౌతీల వైపే వేళ్లు చూపిస్తున్నాయి.