Chopper Hard Landing : కూలిన భారత కోస్ట్‌గార్డ్ హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు

అరేబియా సముద్రంలో హరి లీల అనే ఆయిల్ ట్యాంకర్‌లో జరిగిన ప్రమాదంలో పలువురు  సిబ్బంది గాయపడ్డారు.

Published By: HashtagU Telugu Desk
Chopper Hard Landing Indian Coast Guard Crew Missing

Chopper Hard Landing : భారత కోస్ట్ గార్డ్ దళానికి చెందిన ఒక హెలికాప్టర్ ప్రమాదవశాత్తు అరేబియా సముద్రంలో కూలిపోయింది.  ఈ ఘటనలో ముగ్గురు కోస్ట్ గార్డ్ సిబ్బంది మిస్సయ్యారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఈ ఘటన చోటుచేసుకుందని భారత కోస్ట్ గార్డ్ దళం వెల్లడించింది. అరేబియా సముద్రంలో హరి లీల అనే ఆయిల్ ట్యాంకర్‌లో జరిగిన ప్రమాదంలో పలువురు  సిబ్బంది గాయపడ్డారు. వారు భారత కోస్ట్ గార్డ్ దళానికి కాల్ చేసి సహాయాన్ని కోరారు. దీంతో భారత కోస్ట్ గార్డ్ దళానికి చెందిన హెలికాప్టర్ నలుగురు సిబ్బందితో ఆ ఆయిల్ ట్యాంకర్ వైపుగా బయలుదేరింది. ఈక్రమంలోనే మార్గం మధ్యలో హెలికాప్టర్ అదుపుతప్పి సముద్రంలో కూలింది.  ఈ ఘటనలో ఒక సిబ్బంది ఆచూకీని వెంటనే గుర్తించగా, మరో ముగ్గురు సముద్రంలో గల్లంతయ్యారు. గుజరాత్‌లోని పోర్‌బందర్ నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూలిపోయిన హెలికాప్టర్ శకలాలను(Chopper Hard Landing) సేకరించే ప్రక్రియ పూర్తయింది. రెస్క్యూ కోసం ఈ సంఘటనా స్థలానికి రెండు నౌకలు, రెండు విమానాలను పంపారు.

We’re now on WhatsApp. Click to Join

మరోవైపు  గుజరాత్‌ రాష్ట్రం వరదలతో అతలాకుతలం అవుతోంది. ఈనేపథ్యంలో గుజరాత్‌లోని తీర ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యల్లో భారత కోస్ట్ గార్డ్ దళాలు యాక్టివ్‌గా పాల్గొంటున్నాయి. వాయుసేన, సైన్యం కూడా సహాయక చర్యలలో పాల్గొంటోంది. రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి దాదాపు 17వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో భారత త్రివిధ దళాలు కీలక పాత్ర పోషించాయి.

Also Read :Teenmar Mallanna : సీఎం సహాయ నిధికి రూ 2.75 లక్షలు అందజేసిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఇటీవలే భారత సైన్యానికి చెందిన మానవ రహిత డ్రోన్ పొరపాటున పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోకి ప్రవేశించింది. శిక్షణ అవసరాల కోసం వినియోగిస్తుండగా ఆ డ్రోన్ పొరపాటున భారత భూభాగం దాటింది. దీంతో పాక్ సైన్యం ఆ డ్రోన్‌ను స్వాధీనం చేసుకుంది.  అనంతరం ఇలా ఎందుకు జరిగిందనే దానిపై పాక్ సైన్యానికి భారత ఆర్మీ వివరణ ఇచ్చుకుంది.

Also Read : Telangana Floods : తెలంగాణ వరదలు.. ఉద్యోగులు రూ.100 కోట్ల విరాళం!

  Last Updated: 03 Sep 2024, 12:02 PM IST