Loose Bolt Alert : ప్రపంచవ్యాప్తంగా తమ విమానాలను వినియోగించే విమానయాన సంస్థలకు అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ కీలక సిఫార్సు చేసింది. ‘బోయింగ్ B737 Max’ మోడల్ విమానాల హార్డ్‌వేర్‌లో వదులుగా ఉండే భాగాలను తనిఖీ చేయాలని కోరింది. తాజాగా అంతర్జాతీయ విమాన సర్వీసులోని ఓ బోయింగ్ విమానంలో ఒక బోల్టు ఊడిపోయిందని గుర్తించిన నేపథ్యంలో ఈ అలర్టును జారీ చేసింది. ఆ విమానంలో వెంటనే సమస్యను పరిష్కరించామని బోయింగ్ ప్రకటించింది. భారత్‌లోని మూడు విమానయాన సంస్థలు ఆకాశ ఎయిర్, స్పైస్‌జెట్, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లకు వాటి ఫ్లీట్‌లలో B737 మ్యాక్స్ విమానాలు ఉన్నాయి. బోయింగ్ జారీ చేసిన అలర్ట్ నేపథ్యంలో ఈమూడు సంస్థలు వాటికి చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలలోని నట్స్, బోల్ట్‌లను నిశితంగా పరిశీలించాయి. భారతదేశ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ఈ పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. ఆకాశ, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్‌లతో సంప్రదింపులు(Loose Bolt Alert) జరుపుతోంది.
We’re now on WhatsApp. Click to Join.
- ‘బోయింగ్ 737 మ్యాక్స్’ అనేది ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడవుతున్న విమానాల్లో ఒకటి.
- బోయింగ్ కంపెనీ గత కొన్నేళ్లుగా ఇంజినీరింగ్, క్వాలిటీ సమస్యలను ఎదుర్కొంటోంది.
- 2019లో ఇండోనేషియాలోని జకార్తాలో ఈ మోడల్ విమానం కుప్పకూలిన ఘటనలో 356 మంది మరణించారు. ఆ తర్వాత ఈ విమానం సేల్స్ డౌన్ అయ్యాయి. తిరిగి 2021 నుంచి దీనికి విమానయాన సంస్థల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి.
- బోయింగ్ 737 మ్యాక్స్ విమానం తయారీకి విడిభాగాలను సప్లై చేసే వాళ్లు నాసిరకం తయారీ విధానాలను అనుసరిస్తున్నారని ఈ ఏడాది ఏప్రిల్‌లో గుర్తించారు.
- ఈ నేపథ్యంలో ఓ ప్రధాన వ్యవస్థలో బోల్టు సమస్యతో విమానం ఫ్యాక్టరీని దాటడం బోయింగ్‌కు ఇబ్బందికర పరిణామంగా మారింది.
- బోయింగ్ కంపెనీ 787 డ్రీమ్ లైనర్లలో కూడా సమస్యలు ఉన్నట్లు ఎఫ్‌ఏఏ గుర్తించి హెచ్చరికలు జారీ చేసింది. దీంతో గతేడాది కొంతకాలం డ్రీమ్ లైనర్ల డెలివరీలను నిలిపివేశారు.