Rahul Gandhi: ఈడీ అడిగిన ప్రశ్నలేంటి ? రాహుల్ చెప్పిన సమాధానాలేంటి ?

డైరెక్టరేట్ (ఈడీ) 3 రోజుల్లో (జూన్ 13 నుంచి 15 వరకు) 30 గంటల పాటు విచారించింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ప్రశ్నల వర్షం కురిపించింది.

  • Written By:
  • Publish Date - June 16, 2022 / 11:00 PM IST

రాహుల్ గాంధీని ఎన్ఫోర్స్మెంట్
డైరెక్టరేట్ (ఈడీ) 3 రోజుల్లో (జూన్ 13 నుంచి 15 వరకు) 30 గంటల పాటు విచారించింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఈడీ ఏయే ప్రశ్నలు అడిగింది ? రాహుల్ చెప్పిన జవాబులు ఏమిటి ? అనేది తెలుసుకోవాలనే కుతూహలం ఇప్పుడు అందరిలో ఉంది. దానికి సమాధానంగా ఆంగ్ల మీడియాలో పలు కథనాలు ప్రచురితం అయ్యాయి. వాటి సంక్షిప్త సారాంశం ఇదీ..

1937లో కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నేషనల్‌ హెరాల్డ్‌ వార్తాపత్రికను ప్రచురించే కంపెనీ పేరు.. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్‌). ఏజేఎల్‌కు ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అత్యున్నత నిర్ణాయక కమిటీ ఏఐసీసీ(ఆల్‌ ఇండియా కాంగ్రెస్‌ కమిటీ) రుణాలు ఇచ్చింది. ఈ రుణాలు 2010 డిసెంబరు 16 నాటికి రూ.90.21 కోట్లకు చేరాయి. అదే రోజున ఈ మొత్తం రుణ బకాయిలను, ఏజేఎల్‌కు చెందిన 99.99 శాతం షేర్లను యంగ్‌ ఇండియన్‌కు ఏఐసీసీ బదలాయించింది. ప్రతిగా యంగ్‌ ఇండియన్‌ కంపెనీ రూ.50 లక్షలు చెల్లించింది. అంతకు మూడు రోజుల ముందే (2010 నవంబరు 23)యంగ్‌ ఇండియన్‌ కంపెనీ తొలి మేనేజింగ్‌ కమిటీ సమావేశాన్ని నిర్వహించి, రాహుల్‌ గాంధీని డైరెక్టర్‌గా నియమించారు.

ఈడీ: మీరు డైరెక్టర్ గా ఉన్న యంగ్ ఇండియన్ ప్రయివేట్ లిమిటెడ్ ఎలా పనిచేస్తుంది ?

రాహుల్ : అది నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీ. దాని నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకొని దుర్వినియోగం చేయలేదు.

ఈడీ : ఒకవేళ అది నాట్ ఫర్ ప్రాఫిట్ కంపెనీయే అయితే.. 2010లో స్థాపించిన నాటి నుంచి ఇప్పటివరకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను ఎందుకు చేపట్టలేదు ? ఒకవేళ స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టి ఉంటే ఆధారాలు సమర్పించండి?

రాహుల్ :ఈ ప్రశ్నకు రాహుల్ ఏ సమాధానం చెప్పారో తెలియరాలేదని సదరు మీడియా సంస్థ పేర్కొంది.

ఈడీ : ఏజేఎల్‌, యంగ్ ఇండియన్ మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీల గురించి మీకు ఏమైనా తెలుసా?

రాహుల్ : ఏజేఎల్‌, యంగ్ ఇండియన్ మధ్య జరిగిన లావాదేవీల్లో ధృవీకృత సిగ్నేటరీ గా మోతీలాల్ ఓరా ఉన్నారు. ఆయనకు వివరాలన్నీ తెలుసు.

ఈడీ : ఏజేఎల్‌ తో ముడిపడిన ఆర్థిక లావాదేవీల గురించి మీకు తెలుసా?

రాహుల్ : ఏజేఎల్‌ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను నేను నిర్వహించడం లేదు. (ఈసందర్భంగా రాహుల్ గాంధీ ఏజేఎల్‌, యంగ్ ఇండియన్ సంస్థలకు సంబంధించిన కొన్ని ఫైళ్లను అధికారులకు చూపించారు. రాహుల్ గాంధీతో సంతకం చేయించి ఆ ఫైళ్లను ఈడీ అధికారులు తీసుకున్నారని తెలిసింది.)