Lok Sabha Elections : ప్రశాంతంగా కొనసాగుతున్న రెండో దశ పోలింగ్

కర్ణాటకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన మామయ్యతో కలిసి ఓటు వేశారు

Published By: HashtagU Telugu Desk
Lok Sabha Elections

Loksabhaelections2

సార్వత్రిక ఎన్నికల రెండో దశ (Lok Sabha Elections Phase 2) పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సాయంత్రం 6 గంటలకు ఓటింగ్​ ముగియనుంది. రెండో దశలో మొత్తం 15.88కోట్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అందులో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 మంది మహిళలు, 5,929 ఇతరులు ఉన్నారు. రెండో దశ బరిలో 1,202 అభ్యర్థులు ఉన్నారు. అందులో కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ, లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, సీనియర్​ నటి హేమమాలిని వంటి ప్రముఖులు ఉన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయమే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ బూత్ కు ఓటర్లు, సినీ , రాజకీయ ప్రముఖులు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జమ్ముకశ్మీర్‌లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు తెల్లవారుజాము నుంచే భారీగా బారులు తీరారు. త్రిస్సూర్‌లో ఎన్‌డీఏ అభ్యర్థి, ప్రముఖ నటుడు సురేష్ గోపి ఓటు వేశారు.

We’re now on WhatsApp. Click to Join.

బెంగళూరులో ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకులు నారాయణమూర్తి దంపతులు ఓటు వేశారు. రాజస్థాన్‌లో బీజేపీ నేత వసుంధర రాజే ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తన మామయ్యతో కలిసి ఓటు వేశారు. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వరుసలో నిలబడి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరువనంతపురంలో కేంద్రమంత్రి మురళీధరన్‌ ఓటు వేశారు. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీమిండియా ప్రధాన కోచ్‌, దిగ్గజ ఆటగాడు రాహుల్‌ ద్రవిడ్‌ కూడా బెంగళూరులో ఓటు వేశారు.

కేరళలో మొత్తం 20 స్థానాలకు, కర్ణాటకలో 14, రాజస్థాన్‌ 13, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌లో 8చొప్పున, మధ్యప్రదేశ్‌లో 6, అసోం, బిహార్‌లో ఐదు చొప్పున, ఛత్తీస్‌గఢ్‌, బంగాల్‌లో మూడు చొప్పున, మణిపుర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లో ఒక్కోస్థానానికి ఓటింగ్‌ జరగనుంది.

Read Also : Malaria : దోమ కాటు వల్లే కాదు.. ఈ కారణాల వల్ల కూడా మీరు మలేరియా బారిన పడవచ్చు.!

  Last Updated: 26 Apr 2024, 09:16 AM IST