Site icon HashtagU Telugu

PM Modis Village: ప్రధాని మోడీ సొంతూరిలో ప్రాచీన నాగరికత ఆనవాళ్లు.. విశేషాలివీ

Pm Modis Village

Pm Modis Village

PM Modis Village: గుజరాత్‌లోని వాద్​నగర్​.. ఇది ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్వస్థలం. ఇక్కడ 2,800 ఏళ్ల కిందటి మానవ నివాసాల ఆనవాళ్లు బయటపడ్డాయి. ఈ విషయం ఒక్కరోజులో బయటికి రాలేదు. కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో 20 మీటర్ల లోతు వరకు పురాతత్వవేత్తలు నిరంతరాయంగా తవ్వకాలు జరిపారు. ప్రాచీన బౌద్ధులు, మౌర్యులు, ఢిల్లీ సుల్తాన్‌లు, మొఘలుల కాలాలకు ఈ ప్రాంతం సాక్షిగా నిలుస్తోందని ఈ తవ్వకాలతో వెల్లడైంది. ఈ తవ్వకాల్లో బయటపడిన ప్రాచీన అవశేషాలను ఐఐటీ  ఖరగ్​పుర్, భారత పురాతత్వ సంస్థ (ఏఎస్ఐ), ఫిజిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ – అహ్మదాబాద్, జనవహర్​లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం, దక్కన్ కాలేజీలకు చెందిన పరిశోధకులు పరిశీలించారు. వాద్​నగర్​లో లభించిన ఈ ఆవాసాలు, అవశేషాలు క్రీస్తు పూర్వం 800 నాటివని నిర్ధారించారు. పురాతన బౌద్ధారామ చిహ్నాలు, యవన (గ్రీకు) రాజు అపోలోడాటస్ కాలానికి చెందిన నాణేల ముద్రణ అచ్చులు, బంగారం, వెండి, రాగి, ఇనుము, మట్టిపాత్రలు, పూసల గాజులు సైతం ఇక్కడ(PM Modis Village) బయటపడ్డాయి.

We’re now on WhatsApp. Click to Join.

కరువుల లాంటి వాతావరణ వైపరీత్యాల వల్ల మధ్య ఆసియా ప్రాంతానికి చెందిన పలు తెగలు తరచుగా వాద్ నగర్ పరిసర ప్రాంతాల్లోని రాజ్యాలపైకి దాడులు చేశాయని పురాతత్వవేత్తలు తెలిపారు. మన దేశంలో ప్రాచీన కాలం నుంచి ఇప్పటి వరకు మానవులు నివసిస్తున్న ఏకైక నగరం వాద్​నగరే అని వెల్లడించింది. క్రీస్తు పూర్వం 1400 నుంచే వాద్​నగర్ ప్రాంతం మానవ ఆవాసంగా మారి ఉండొచ్చని అంచనా వేశారు. హరప్పా లేదా సింధు నాగరికత కాలం నుంచే వాద్​నగర్ ఉందని చెబుతున్నారు. ఈ లెక్కన భారత్​లో 5,500 సంవత్సరాల నుంచే మానవ నాగరికత ఉన్నట్టు. వాద్​నగర్​లో మొత్తం 30 ప్రాచీన ప్రాంతాలను గుర్తించి, వాటిలో తవ్వకాలు జరిపి లక్షకు పైగా ఆనవాళ్లను వెలికి తీశారు. బౌద్ధ, జైన, హిందూ మతాలకు చెందిన ప్రజలు ఇక్కడ కలిసిమెలిసి జీవించేవారని ఆర్కియలాజికల్ సూపర్​వైజర్  ముకేశ్ ఠాకూర్ తెలిపారు.

Also Read: Rs 500 Gas Cylinder : వచ్చే నెల నుంచే ఆ రెండు పథకాలు అమల్లోకి !

అమెజాన్ అడవుల్లో పురాతన నగరం

పచ్చని వృక్షసంపదతో కనిపించే అమెజాన్ అడవుల్లో వేల సంవత్సరాలనాటి భారీ పురాతన నగరం ఆనవాళ్లను గుర్తించారు. అమెజాన్ అడవుల్లో నివసించే వారి గురించి మనం ఇప్పటివరకు తెలుసుకున్న చరిత్రను మార్చేరీతిలో ఇటీవల గుర్తించిన అతి పురాతన నగరంలోని విశేషాలు ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. అమెజాన్ పరిధిలోని తూర్పు ఈక్వెడార్‌లో ఉన్న ఉపానో ప్రాంతంలో అతి పురాతన నగరం ఉన్నట్లు గుర్తించారు. అక్కడ వేలకొద్దీ దీర్ఘ చతురస్రాకారపు ఆకారంతో నిర్మాణాలు రోడ్లు, కాలువలతో అతిపెద్ద నగరమే ఉండేదని గుర్తించారు.అగ్నిపర్వతపు నీడలో ఉండే ఈ నగరం అంతరించిపోవడానికి, అగ్నిపర్వతానికి సమీపంలో ఉండటమేనని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.