Site icon HashtagU Telugu

Air India crash : విమాన ప్రమాదంలో 265 మంది మృతి

265 Dies Air India

265 Dies Air India

అహ్మదాబాద్‌(Ahmedabad )లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం (Air India crash) దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం కారణంగా విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. మృతుల్లో 169 మంది భారతీయులు కాగా, 52 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ మరియు కొంతమంది కెనడియన్లు ఉన్నారు. ప్రమాదంలో 12 మంది విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు.

Air India Ahmedabad Plane Crash : డబుల్ ఇంజిన్లు ఫెయిల్ అవ్వడం వల్లే ప్రమాదమా..?

ఈ ప్రమాదంలో ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టు సమాచారం. అతను భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడని ఎయిర్ ఇండియా వెల్లడించింది. అలాగే విమానం విమానాశ్రయం వెలుపల ఉన్న మెడికల్ కాలేజ్ భవనం పై కూలడంతో ఆ సమాయంలో అక్కడ ఉన్న మెడికల్ విద్యార్థుల్లో 24 మంది మృతిచెందినట్టు అధికారులు ధృవీకరించారు. అలాగే పదుల సంఖ్యలో గాయపడినట్లు పేర్కొన్నారు.

Celebrities Died in Plane Crashes: విమాన ప్రమాదాల్లో మరణించిన ప్రముఖులు వీరే..!!

ఈ ఘటనపై ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శవాలను గుర్తించేందుకు అధికారులు మృతుల బంధువులకు సహాయంగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఘటనా స్థలానికి వైద్య బృందాలను పంపించి సహాయక చర్యలు చేపట్టింది. పూర్తి దర్యాప్తు ప్రారంభమైందని, ప్రమాదానికి గల అసలైన కారణాలు త్వరలో వెల్లడిస్తామని ఏవియేషన్ శాఖ ప్రకటించింది.