Job Notifications in Punjab : పంజాబ్ ప్ర‌భుత్వం తొలి సంచ‌ల‌నం

తొలి స‌మావేశంలోనే పంజాబ్ ప్ర‌భుత్వం సంచ‌ల‌నం సృష్టిస్తూ 25వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదం తెలుపుతూ నిర్ణ‌యం తీసుకుంది. \

  • Written By:
  • Publish Date - March 19, 2022 / 05:19 PM IST

తొలి స‌మావేశంలోనే పంజాబ్ ప్ర‌భుత్వం సంచ‌ల‌నం సృష్టిస్తూ 25వేల ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి ఆమోదం తెలుపుతూ నిర్ణ‌యం తీసుకుంది. ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ నేతృత్వంలోని పంజాబ్ మంత్రివర్గం రాష్ట్ర శాఖలు, బోర్డులు మరియు కార్పొరేషన్లలో 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆమోదం తెలిపింది. శ‌నివారం ప్రమాణ స్వీకారం చేసిన వెంట‌నే స‌మావేశ‌మైన మంత్రివ‌ర్గం తొలి నిర్ణ‌యం ఉద్యోగాల భ‌ర్తీపై తీసుకోవ‌డా యావ‌త్తు దేశంలోని యువ‌త పంజాబ్ స‌ర్కార్ వైపు చూస్తోంది. పోలీసు శాఖలో 10 వేల ఉద్యోగాలు, ఇతర విభాగాల్లో 15 వేల ఉద్యోగాలు రానున్నాయి. ఒక నెలలో ఉద్యోగ ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వ‌డానికి షెడ్యూల్ చేసింది.ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానం ప్ర‌కారం యువతకు ఉద్యోగ అవకాశాలు క‌ల్పించ‌డంపై AAP ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా ఉంది. ఒక మ‌హిళ‌తో పాటు 10 మంది మంత్రుల‌తో చండీగఢ్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. గురునానక్ దేవ్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ 10 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. పంజాబ్ రాజ్ భవన్ లో వీరంతా పంజాబీలో ప్రమాణం చేశారు. హర్పాల్ సింగ్ చీమా , గుర్మీత్ సింగ్ మీత్ హయర్ మినహా మరో ఎనిమిది మంది మొదటిసారి ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్ర‌మాణం చేశారు. జండియాలా నుండి హర్భజన్ సింగ్, మాన్సా నుండి డాక్టర్ విజయ్ సింగ్లా, భోవా నుండి లాల్ చంద్, బర్నాలా నుండి గుర్మీత్ సింగ్ మీట్ హయర్, అజ్నాలా నుండి కుల్దీప్ సింగ్ ధాలివాల్, పట్టి నుండి లాల్జిత్ సింగ్ భుల్లర్, హోషియార్‌పూర్ నుండి బ్రామ్ శంకర్ జింపా మరియు హర్జోత్ సింగ్ బైన్స్ ఆనంద్‌పూర్ సాహిబ్ ఎన్నిక‌య్యారు. ముఖ్యమంత్రితో సహా కేబినెట్‌లో 18 బెర్త్‌లు ఉన్నాయి. మంత్రివర్గంలో, పార్టీ మాల్వా నుండి ఐదుగురు, మాజా నుండి నలుగురు మరియు దోబా ప్రాంతం నుండి ఒకరికి ప్రాతినిధ్యం వహించింది.రిజర్వ్ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించే నలుగురు ఎమ్మెల్యేలకు ఇది అవ‌కాశం కల్పించింది. దిర్బా, జండియాలా, మలౌట్ మరియు భోవాలే కాకుండా నలుగురు జాట్ సిక్కులు ఇద్దరు హిందువులు ఉన్నారు. 117 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీలో అఖండ విజయంతో ఆప్ 92 స్థానాలను కైవసం చేసుకున్న విష‌యం విదిత‌మే.