Site icon HashtagU Telugu

LIC Jobs : 250 అప్రెంటిస్‌షిప్ జాబ్స్.. ఎల్​ఐసీ ఎంప్లాయీగా మారే ఛాన్స్

Lic Jobs

Lic Jobs

LIC Jobs : ఎల్​ఐసీ సంస్థకు చెందిన ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్‌లలో అప్రెంటిస్‌షిప్ చేసే అవకాశమిది. దేశవ్యాప్తంగా 250 అప్రెంటిస్‌షిప్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏదైనా డిగ్రీ చేసిన అభ్యర్థులు ఈ జాబ్స్‌కు అప్లై చేయొచ్చు. 2023 డిసెంబర్ 1 నాటికి 20 నుంచి 25 ఏళ్లలోపు వయసు కలిగినవారు వీటికి అర్హులు. అప్లికేషన్ ఫీజు దివ్యాంగ అభ్యర్థులకు రూ.472, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు  రూ.708, జనరల్ కేటగిరీ, ఓబీసీ అభ్యర్థులకు రూ.944 ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు చివరి తేదీ డిసెంబర్​ 31.

We’re now on WhatsApp. Click to Join.

ఎగ్జామ్ ఫీజు కట్టేందుకు లాస్ట్ డేట్  జనవరి 03. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనవరి 6న ఎగ్జామ్ ఉంటుంది. జనవరి 9 నుంచి 11 వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఈ జాబ్స్‌కు ఎంపికయ్యే అభ్యర్థులకు జాబ్ ఆర్డర్స్ జనవరి 12 నుంచి 13లోగా జారీ అవుతాయి. జనవరి 15 నుంచి ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ బ్రాంచ్‌లలో వీరికి  ట్రైనింగ్ ప్రారంభం అవుతుంది. అభ్యర్థులకు 12 నెలలు అప్రెంటిస్​ శిక్షణను అందిస్తారు. ప్రతినెలా రూ.9,000 నుంచి రూ.15,000 వరకు స్టైపెండ్‌ను(LIC Jobs)​ అందిస్తారు.

Also Read: Chimpanzees : చింపాంజీలు, బోనోబోల మెమొరీ పవర్‌పై సంచలన నివేదిక