Murder : స్నేహితుడిని హ‌త్య చేసిన యువ‌కుడు.. వారిద్ద‌రూ..?

ఐదు వంద‌ల రూపాయ‌ల కోసం ఓ యువ‌కుడు త‌న స్నేహితుడిని హ‌త్య చేశాడు...

Published By: HashtagU Telugu Desk
Murder Accused Imresizer

Murder Accused Imresizer

ఐదు వంద‌ల రూపాయ‌ల కోసం ఓ యువ‌కుడు త‌న స్నేహితుడిని హ‌త్య చేశాడు. ఈ సంఘటన సెప్టెంబర్ 18 న జరిగింది. వారిద్దరూ డ్రగ్స్ బానిసలుగా పోలీసులు గుర్తించారు. అయితే వారి మధ్య వాగ్వాదం జరిగిందని.. ఆ తర్వాత నిందితుడే బాధితుడిని కత్తితో పొడిచిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. ఈ కేసులో నిందితుడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబరు 18వ తేదీ రాత్రి 10.40 గంటలకు, గాయంతో అడ్మిట్ అయిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి నుండి పోలీసులకు సమాచారం అందింది. పోలీసు బృందం ఆసుపత్రికి చేరుకుని మరణించిన వ్యక్తిని 22 ఏళ్ల షారుక్‌గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

షారూఖ్ ఐరన్ ఫ్యాక్టరీలో డై మేకర్‌గా పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. ఘటన జరిగిన రోజు అదే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న తన స్నేహితుడు సల్మాన్‌తో కలిసి కనిపించాడు. వారిద్దరూ డ్రగ్స్‌కు బానిసలని.. ఘటన జరిగిన రోజు డ్రగ్స్‌ విషయంలో గొడవ పడ్డారని తేలింది. సల్మాన్ తన ఇంట్లో కనిపించకుండా పోయాడు. రహస్య సమాచారం మేరకు జఫ్రాబాద్ మెట్రో స్టేషన్ సమీపంలో ట్రాప్ వేసి సల్మాన్‌ను పోలీసులు పట్టుకున్నారు. తాను చేసిన నేరాన్ని అంగీకరించి, కొన్ని డ్రగ్స్ తీసుకురావాలని మృతుడు రూ.500 ఇచ్చాడని, దానిపై వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు వెల్లడించాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు షారుక్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు.

  Last Updated: 22 Sep 2022, 08:16 AM IST