Site icon HashtagU Telugu

UP : దైవదర్శనానికి వెళ్తుండగా నదిలో ట్రాక్టర్ బోల్తా…27మంది దుర్మరణం..మృతుల్లో చిన్నారులు..!!

Tracotr

Tracotr

ఉత్తరప్రదేశ్ కాన్పూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ బోల్తాపడిన దుర్ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 11మంది చిన్నారులు …11 మంది మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది. మరో 25 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఉన్నావో జిల్లాలోని చంద్రికాదేవి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. క్షతగాత్రులను పీహెచ్ సి కాన్పూర్ ఆసుపత్రులకు తరలించారు.

ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ హోం శాఖ మంత్రి అమిత్ , రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ , యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ సంతాపం తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన యోగిఆధిత్యానాద్ మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు, గాయపడినవారికి 50వేల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంమే ప్రమాదానికి కారణమన్న ప్రాథమిక విచారణ కు వచ్చారు పోలీసులు.